- వైయస్ షర్మిల గారి పోరాటానికి దిగివచ్చిన గులాబిదండు
- నిరుద్యోగ నిరాహార దీక్షలతో అధికార పార్టీపై ఒత్తిడి
- టీఎస్పీఎస్సీ ముట్టడితో రాష్ట్ర సర్కార్ లో కదలికలు
- ఎట్టకేలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర సర్కార్ ప్రకటన
YSR తెలంగాణ పార్టీ చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్ష కృషి ఫలితంగా తెలంగాణలో నోటిఫికేషన్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉద్యోగాలు లేక కొన్నేండ్లుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న నిరుద్యోగులకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నిరుద్యోగులు ఒక పక్క ఆనందంలో ఉన్నా కొన్నేండ్లుగా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూశారు. ఏటా లక్షల సంఖ్యలో డిగ్రీలు, పీజలు చేస్తూ యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చిన నిరుద్యోగులకు వేల సంఖ్యలో విడుదలైన నోటిఫికేషన్లు వారికి సరిపోకపోవడం గమనార్హం. పబ్లిక్ సర్విస్ కమిషన్ లో 20లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 80వేల ఉద్యోగాలలో ఒక్కో పోస్టుకు 24 మంది పోటీ పడనున్నారు. ఎన్నికల హామీల్లో ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ తిరిగి ఎన్నికల కోసమే 80వేల నోటిఫికేషన్లు ప్రకటించారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
నిరుద్యోగ నిరాహార దీక్షల ఫలితంగానే నోటిఫికేషన్ల ప్రకటన
YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు 17 నిరుద్యోగ నిరాహార దీక్షలు నిర్వహించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల తరుఫున రాష్ట్ర సర్కారుకు గళమెత్తి వినిపించారు. ఉద్యోగాలు లేక టీ, టిఫిన్ సెంటర్లలో, హమాలీ పనికి డిగ్రీలు, పీజీలు చేసిన యువత వెలుతున్నారని వైయస్ షర్మిల గారు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు మనస్తాపంతో ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్న ఘటనలు తెలంగాణలో ఉన్నాయని పేర్కొన్నారు.
YSR తెలంగాణ పార్టీ టీఎస్పీఎస్సీ ముట్టడి
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర సర్కారును కోరుతూ 3రోజుల నిరాహార దీక్ష సైతం వైయస్ షర్మిల గారు చేశారు. 50కిపైగా మీడియా సమావేశాలు నిర్వహించి గులాబిదండు నిరంకుశ పాలనను ఎండగట్టారు. నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు కేసీఆర్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 50కి పైగా ట్వీట్లతో తెలంగాణలో నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వానికి వినిపించారు. టీఎస్పీఎస్సీని ముట్టడించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని నిరాహార దీక్షకు దిగారు. పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినా అక్కడా నిరాహార దీక్షలో సైతం వైయస్ షర్మిల గారు కూర్చున్నారు. ధర్నాకు దిగిన YSR తెలంగాణ పార్టీ నాయకులను పోలీసులు దాడి అరెస్టు చేసినా నిరుద్యోగుల పక్షన పోరాటం విరమించుకోలేదు. ఆత్మహత్య చేసుకున్న పదుల సంఖ్యలో నిరుద్యోగుల కుటుంబాలను YSR తెలంగాణ పార్టీ నాయకులతో కలిసి వైయస్ షర్మిల గారు పరామర్శించారు. YSR తెలంగాణ పార్టీ అండగా ఉంటుందని వైయస్ షర్మిల గారు హామీనిచ్చారు. ర్యాలీలు, సభలతో నిరుద్యోగులకు ఉద్యోగాలు వెంటనే కల్పించాలని రాష్ట్ర సర్కార్ ను డిమాండ్ చేశారు.
హేళన చేసినా లెక్క చేయకుండా...
నిరుద్యోగ నిరాహార దీక్షలపై రాష్ట్ర సర్కార్ ఇబ్బందులకు గురిచేసినా వైయస్ షర్మిల గారు వెనుదిరగకుండా నిరుద్యోగుల తరుఫున పోరాడారు. వైయస్ షర్మిల గారు చేస్తున్న నిరుద్యోగ నిరాహార దీక్షలపై టీఆర్ఎస్ మంత్రులు విమర్శలు సైతం చేశారు. అయినా విమర్శలను లెక్క చేయకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పోరాటం చేశారు. ఉద్యోగాలు లేక ఇబ్బందుల్లో ఉన్న నిరుద్యోగులకు YSR తెలంగాణ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైయస్ షర్మిల గారు వెన్నంటి ఉన్నారు. యూనివర్సిటీలలో విద్యార్థులతో మాట్లాడి నిరుద్యోగులకు అండగా నిలిచారు. ఉద్యోగాలు కల్పించలేని ముఖ్యమంత్రి మనకొద్దు అంటూ గళమెత్తి వినిపించారు.