ప్రజాప్రస్థానంలో భాగంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం ఇల్లందు మండలం చర్చ్ రోంపేడు గ్రామంలో "రైతు గోస" కార్యక్రమం నిర్వహించారు.రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ..
- మహానేత వైయస్ఆర్ గారు పాదయాత్రలో పోడు రైతుల సమస్యలు విని అధికారంలోకి వచ్చిన వెంటనే 11లక్షలు ఎకరాల పోడు భూములు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో తొలివిడతగా 3.3లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారు. మిగతావి భూములకు ఇద్దాం అనుకున్న సమయంలో ఆయన మరణించారు.
- వైయస్ఆర్ అనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు గానీ, ఎనిమిదేండ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ గానీ పోడు పట్టాల గురించి పట్టించుకోలేదు.
- ఎన్నికల ముందు కుర్చీ వేసుకుని మరీ పోడు భూములకు పట్టాలు ఇస్తానన్న కేసీఆర్.. ఎనిమిదేండ్లుగా ఇంత వరకు ఒక్క ఎకరాకు పట్టా ఇవ్వలేదు.
- పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి కేసీఆర్ కు లేదు.
- తాతముత్తాతల నుంచి గిరిజనులు పోడు భూములను నమ్ముకుని సాగు చేసుకుంటున్నారు.
- గతంలో పోడు భూములకు ఇచ్చిన పట్టాలను సైతం ప్రభుత్వం లెక్క చేయడం లేదు.
- ఓట్ల కోసమే కేసీఆర్ వాగ్ధానాలు చేస్తాడు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడ మల్లన్న అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.
- గిరిజనుల ప్రాణాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు. మగవాళ్లతోపాటు మహిళలను సైతం లాఠీలతో కొడుతున్నారు. మహిళలతో పాటు చంటి పిల్లల తల్లులను సైతం జైలులో పెడుతున్నారు. - మంచినీళ్లు అడిగినా, బువ్వ అడిగినా పెట్టడం లేదు. పైగా జైలులో నానాచాకిరీ చేయించుకుంటున్నారు. బతిమిలాడితే తప్ప మంచినీళ్లు ఇవ్వడం లేదు.
- పోడు భూములపై ఫారెస్ట్ ఆఫీసర్లు దౌర్జన్యం చేసి, ఆడవాళ్లు అని కూడా చూడకుండా జుట్టుపట్టుకుని లాక్కెళ్తున్నారు. ఆడవాళ్లు అన్న కనికరం కూడా కేసీఆర్ కు లేదు.
- అసలు పోడు భూములను లాక్కునే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది?
- ఓటు అనేది ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం. దానితోనే కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి.
- ప్రజల పక్షాన పోరాటం చేయడానికి YSR తెలంగాణ పార్టీ పెట్టాం. ప్రజలు ఆశీర్వదిస్తే వైయస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తాం.
- పోడు భూములకు పట్టాలు ఇస్తాం. వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. ఆరోగ్యశ్రీని బ్రహ్మాండం చేస్తాం. మహిళలకు రుణాలు పంపిణీ చేసి, ఆర్థికంగా బలోపేతం చేస్తాం. పేద వాళ్లకు ఇండ్లు నిర్మించి, మహిళల పేర్ల మీదనే రిజిస్ట్రేషన్ చేయిస్తాం. ఉచిత విద్య, వైద్యంతో పాటు మన పిల్లలందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తాం.
- ఉద్యోగాలు భర్తీ చేసి, నిరుద్యోగ యువతకు అండగా ఉంటాం. బీసీ, ఎస్టీ, ఎస్సీ కార్పొరేషన్ల లోన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తాం. రైతులతో పాటు కౌలు రైతులకూ న్యాయం చేస్తాం.