ప్రజాప్రస్థానంలో భాగంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్ మండలం గరీబ్ పేట గ్రామంలో "రైతు గోస" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ..
- రైతులు అప్పులపాలైనా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ సాయం చేయడు. ఆదుకోడు, చెవులు, కండ్లు ఉండి రైతుల కష్టాలు వినలేని, చూడలేని ముఖ్యమంత్రి. రైతులు ఎప్పుడు కోటీశ్వరులయ్యారో, ఎక్కడ కార్లలో తిరుగుతున్నారో కేసీఆర్ కే తెలియాలి. కేసీఆర్ తీరుతో రైతులకు నష్టం మీద నష్టం, అప్పుల మీద అప్పులు అవుతున్నాయి. అన్ని పథకాలు బంద్ పెట్టి ఎకరాకు రూ.5వేలు ఇచ్చి గొప్పలు చెబుతుండు. 5వేలు దేనికి సరిపోతాయో కేసీఆర్ సమాధానం చెప్పాలి.
- కేసీఆర్ దృష్టిలో సంక్షేమమంటే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో లాక్కోవడమే. రైతుబంధు పైకం రుణమాఫీ కింద జప్తు చేస్తున్నరు. వచ్చిన పైసలు వడ్డీలకే సరిపోతున్నయ్. ఇక రైతును ఆదుకునే వారేరి? కేసీఆర్ కౌలు రైతులను మనుషులుగా కూడా చూడడం లేదు.మహిళలకు ఖర్చు మోపెడతోంది. ఏది ముట్టుకున్నా రేట్లు భగ్గుమంటున్నయ్. నూనె రేట్లు పెరిగినయ్. గ్యాస్ రేట్లు పెరిగినయ్. పప్పు, ఉప్పుల రేట్లు పెరిగినయ్. ఇక మహిళలు బాగుపడేదెప్పుడు?
- వైయస్ఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలయ్యేది. నేడు ఆసుపత్రులకు వెళితే రూ.లక్షల్లో బిల్లులు గుంజుతున్నరు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎలుకలు పీక్కుతింటే.. ప్రైవేటులో బిల్లులు పీక్కుతింటున్నారు. కేసీఆర్ కు జబ్బు వస్తే ఢిల్లీకి పోయి, అక్కడే వారం రోజులు ఉండి వస్తడు. సామాన్యులు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాయి. అక్కడి వెళ్తే ఎమెర్జెన్సీ వార్డులో ఎలుకలుంటయ్. స్పెషల్ వార్డులో పిల్లులుంటయ్. డాక్టర్లు ఉంటే నర్సులుండరు. నర్సులుంటే మందులుండవు. ఇలాగేనే ఒక ముఖ్యమంత్రి ఉండేది.
- కేసీఆర్ చేసిన ఒక్క సంతకానికి రైతులు ఆగమయ్యారు. 17లక్షల ఎకరాల్లో నీళ్లు ఉన్నా వరి వేయలేదు. వరి వేసినోళ్లు కొంటారో.. లేదోనని మానిసిక క్షోభకు గురయ్యారు. రైతుల్ని బావిలో తోసి రక్షించండి అని ధర్నాలు చేశారు. ఏదో పొడిచేస్తానని యోధుడిలా ఢిల్లీకి పోయి, ఉత్త చేతులతో తిరిగొచ్చి, రాష్ట్ర పరువు తీశారు. కేసీఆర్ చేసేదల్లా రాజకీయాల కోసమే. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ నాయకులు తప్ప ఏ వర్గమూ బాగుపడలేదు.
- అధికార పార్టీ నేతలే అరాచకాలకు పాల్పడుతుంటే, దండించాల్సిన కేసీఆర్.. పోలీసుల సాయంతో కేసుల నుంచి తప్పిస్తున్నడు. కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఆడవాళ్ల అవసరాలను ఆసరాగా చేసుకుని అత్యాచారాలకు పాల్పడినా దర్జాగా బయట తిరుగుతున్నడు. టీఆర్ఎస్ నాయకుల వేధింపులతో తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్ కనీసం స్పందించలె. ప్రభుత్వం ఉన్నది టీఆర్ఎస్ పార్టీ కోసమా? ప్రజల కోసమా? పోలీసులను పనోళ్లలా వాడుకుని దారుణాలకు పాల్పడుతున్నరు.
- గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వకుండా, వారిపై దాడులు చేయించి, జైలులో పెడుతున్నడు. టీఆర్ఎస్ ను ఏమైనా అంటే వడ్ల కంకులతో కొట్టాలని మంత్రులు, ఎమ్మెల్సీలు అంటున్నరు. మరి పోడు ఇస్తానని చెప్పి మాట తప్పిన కేసీఆర్ ను ఏ చీపురుతో కొట్టాలి? రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించే పార్టీ లేదు. అందుకే YSR తెలంగాణ పార్టీని స్థాపించాం. ప్రజల సంక్షేమానికి, ప్రజల బాగు కోసం పుట్టిందే YSR తెలంగాణ పార్టీ. ప్రజలు ఆశీర్వదిస్తే వైయస్ఆర్ సంక్షేమ పాలనను తిరిగి తీసుకొస్తాం.