ప్రజాప్రస్థానంలో భాగంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి YS షర్మిల గారు 59వ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్ మండలంలో పాదయాత్ర చేపట్టారు. సాయంత్రం కొత్తగూడెం పట్టణంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ...
‘‘సింగరేణిని కేసీఆర్ దివాలా తీసిండు. రూ.3వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న సింగరేణిని.. 8వేల కోట్ల అప్పులపాలు జేసిండు. 60వేల మంది కార్మికులతో కళకళలాడే సింగరేణి.. నేడు 40వేల మందికి తగ్గిపోయింది. సింగరేణి ఆస్తుల్ని కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నడు. ఎనిమిదేండ్లలో 67మంది కార్మికులు చనిపోతే కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలె. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి కేసీఆర్ నోరెత్తడం లేదు. బీజేపీతో తత్సంబంధాలు ఉన్నప్పుడు దీనిని పట్టించుకోలె. వాళ్లతో సంబంధం తెగాక ఒక రోజు ధర్నా చేసి, వదిలేసిండు. కేసీఆర్ కు తెలిసిందల్లా గారడి మాటలు, గలీజు తిట్లు. టీఆర్ఎస్ లీడర్ల ఒత్తిడి తట్టుకోలేక తల్లీకొడుకులు ఒళ్లు కాల్చుకున్నారంటే దానికి కారణం కేసీఆర్. కొత్తగూడెం ఎమ్మెల్యే అరాచకాలతో సామాన్యులు బలవుతున్నారు. ఒక ఫైనాన్షియర్, ఇద్దరు భార్యభర్తల ఆత్మహత్యలకు కారణమై నేడు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నడు. సాయం అడిగితే కమీషన్లు, లంచాలతో పాటు ఆడవాళ్ల మానం కూడా అడుతున్నారంటే వాళ్లు మనుషులా? మృగాలా? రాష్ట్రంలో రౌడీల, గుండాల రాజ్యం నడుస్తోంది. కబ్జాలు, సెటిల్మెంట్లకు తోడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పిస్తున్నరు. కేసీఆర్ కు తెలిసిందల్లా దొంగ మాటలు చెప్పడం, ఓట్లు వేయించుకోవడం, ఫామ్ హౌజ్‌కు వెళ్లిపోవడం.’’