ప్రజాప్రస్థానంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం మొండికుంటలో నిర్వహించిన "మాట-ముచ్చట" కార్యక్రమంలో షర్మిలక్క ప్రసంగం..
- గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్య పోడు భూముల సమస్య
- పాలకులు చాలామంది భూములు లాక్కున్నారు.
- పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు ఇదే సమస్య చెబుతున్నారు.
- పోడు భూముల సమస్య భయంకరంగా వేధిస్తోంది.
- ఎస్సీ , ఎస్టీలు ప్రధానంగా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు.
- వైయస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 లక్షల 30 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారు.
- అవి గాక ఎస్సీలకు మరో 3 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు.
- రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు భూమి మీద హక్కు కల్పించారు.
- వైయస్ఆర్ గారి తర్వాత వచ్చిన పాలకులు గానీ, ఇప్పుడు ఎనిమిదేళ్లుగా పాలిస్తున్న కేసీఆర్ గారు కానీ ఒక్క ఎకరాకు కూడా ఎందుకు పట్టాలు ఇవ్వలేదు.
- కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పారు?
- పోడు భూముల సమస్య ఉందని మాకు తెలుసు , పరిష్కరిస్తాం అన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక గాలికొదిలేశారు.
- ఎందుకంటే సమస్య పరిష్కరించాలి అన్న చిత్తశుద్ది కేసీఆర్ గారికి లేదు.
- పోడు భూముల పట్టాలు కావాలని ప్రజలు మొత్తుకుంటుంటే పట్టాలు ఇవ్వకపోగా , ఉన్న భూములను గుంజుకుంటున్నారు.
- భూములు కోల్పోతున్న ప్రజల ఏడుపు పాలకులకు పట్టడం లేదు.
- తండ్రులు, తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న వేలాది ఎకరాల భూములను ఫారెస్ట్ అధికారులు లాక్కొని మా మీద కేసులు పెట్టారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఖమ్మం జిల్లాలో చంటి పిల్లల తల్లులు అని కూడా చూడకుండా 21 మంది మహిళలను జైల్లో పెట్టి లాఠీలతో కొట్టారు.
- పాలకులు ఇలాగే పరిపాలిస్తారా? పాలకుల లక్ష్యం ఇదేనా?
- ఆనాడు వైయస్ఆర్ గారు ఎంతో అద్భుతంగా పరిపాలించారు.
- రైతులకు రుణమాఫీ చేశారు.
- వ్యవసాయాన్ని పండుగ చేశారు.
- పోడు పట్టాలు అందించారు.
- పేద పిల్లల చదువుల కోసం ఫీ రీయంబర్స్ మెంట్ అమలు చేశారు.
- ఆరోగ్య శ్రీ పథకంతో పేదలకు ఉచిత వైద్యం అందించారు.
- మహిళలకు, రైతులకు పావలా వడ్డీకే రుణాలు అందించారు.
- 46 లక్షల మంది పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టి సొంతింటి కల నెరవేర్చారు.
- వైయస్ఆర్ గారి తర్వాత వచ్చిన పాలకులతో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని , మా బతుకులు మారలేదని ప్రజలు బాధపడుతున్నారు.
- పాలకులు ప్రజల కోసం కాదా ఉన్నది?
- పాలకులు ప్రభుత్వాన్ని వాళ్ల కుటుంబాల కోసం, స్వార్థం కోసం, రాజకీయాల కోసం నడుపుతున్నారు.
- కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగు పడ్డారు? ఎవరూ బాగుపడలేదు.
- అసలు రాష్ట్రంలో కేసీఆర్ గారు మోసం చేయని వర్గం ఏదైనా ఉందా?
- రుణమాఫీ అని రైతులను మోసం చేశారు
- సున్న వడ్డీకే రుణాలు అని మహిళల్ని మోసం చేశారు.
- కేజీ టూ పీజీ ఉచిత విద్య అని విద్యార్థుల్ని మోసం చేశారు.
- ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగుల్ని మోసగించారు.
- ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని మళ్లీ మోసం చేశాడు.
- పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని మోసం చేశాడు.
- మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు.
- పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు.
- మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు.
- ఇలా కేసీఆర్ ప్రతి వర్గాన్ని మోసం చేశాడు. - కేసీఆర్ మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు వస్తాడు దొంగ హామీలు చెప్తాడు.
- ఓట్ల కోసం దళిత బంధు అంటాడు, బీసీ బంధు అంటాడు, దొంగ మాటలు చెప్తాడు.
- ప్రజలు రెండు సార్లు కేసీఆర్ని నమ్మి మోసపోయారు.
- రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ ప్రజల కోసం ఏం చేశారు?
- కేసీఆర్ పాలనలో ఒక్క కుటుంబం అయినా బాగుపడిందా?
- అన్ని ధరలు పెరిగిపోయి పేద ప్రజలకు బతుకే భారం అయిపోయింది.
- కూలీ పనులకు పోయినా ఖర్చులకు సరిపోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- పాలకులు ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తున్నారా?
- పాలకులు ప్రజల నుంచి దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు.
- ఇదేనా బంగారు తెలంగాణ?
- పేద వాళ్లకు బతుకే లేకుండా చేశారు?
- బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణగా మార్చారు.
- రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాత్రి, పగలు తేడా లేకుండా తాగుబోతులే.
- బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణ చేశారు.
- ఎనిమిదేళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
- ఉద్యోగ నోటిఫికేషన్లు లేక వందల మంది నిరద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు.
- డిగ్రీలు , పీజీలు చేసి ఆటో నడుపుకొంటున్నారు, ఆడ పిల్లలు పత్తీ, మిర్చి ఏరడానికి పోతున్నారు.
- కేసీఆర్ ఏం చేసినా ఓట్ల కోసమే చేస్తున్నాడు.
- పెద్ద కొడుకునని చెప్పుకుంటుండు ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తుండు.
- పెన్షన్లు సరిగా ఇవ్వరు, కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదు.
- ఇది ప్రజాస్వామ్యమా? ఇది గూండాల రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం.
- పాలకులు రాష్ట్రాన్ని దోచుకొని దాచుకోవడానికే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.
- పేదల బతుకులు చితికిపోతున్నాయి, పాలకులు మాత్రం పెద్ద పెద్ద గడీలు , కోటలు కట్టుకొని బతుకుతున్నారు.
- ప్రజలు తమ గురించి ఆలోచించే వారిని పాలకులుగా ఎన్నుకోవాలి.
- వైయస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలను సొంత బిడ్డల్లా ప్రేమించారు.
- వైయస్ఆర్ గారు ప్రజల మనిషి. పేద ప్రజల సంక్షేమం కోసమే ఎన్నో పథకాలు రూపొందించి అద్భుతంగా అమలు చేశారు.
- కానీ ఇప్పుడున్న పాలకులు స్వార్థపరులు, వాళ్ల కుటుంబం గురించే ఆలోచిస్తారు.
- కేసీఆర్ కుటుంబంలో ఐదు ఉద్యోగాలున్నాయి, వాళ్లు ఆస్తులు సంపాదించుకుంటున్నారు, కూడబెట్టుకొని దాచుకుంటున్నారు.
- తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాడే వాళ్లు లేక ప్రజల బాగు కోసం ఆలోచించి వైయస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం.
- ప్రజలకు మళ్లీ వైయస్ఆర్ సంక్షేమ పాలన అందించడానికే పోరాడుతున్నాం.
- రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నా మీరు అవకాశం ఇచ్చిన రోజున వ్యవసాయాన్ని పండుగ చేస్తాం.
- కౌలు రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం పని చేస్తాం.
- మొక్కలు నాటినా, లాక్కున్నా, మీ పోడు భూముల పట్టాలను మీ చేతుల్లో పెడతాం.
- ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా, అదీ ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా అందిస్తాం.
- మహిళలను ఆర్థికంగా నిలబెడతాం.
- పేద పిల్లలు ఉచిత విద్య అందిస్తాం.
- ఆరోగ్య శ్రీ ని మళ్లీ అమలు చేస్తాం.
- నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం మొదటి సంతకం పెడతాం.
- ఎస్సీ , ఎస్టీ, బీసీ , మైనార్టీల సంక్షేమం, పేదల కోసం పని చేసే ప్రభుత్వాన్ని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ తీసుకొస్తుందని మీకు మాటిస్తున్నాం.