ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం మావిల్లపల్లి గ్రామంలో నిర్వహించిన ‘రైతుగోస’ కార్యక్రమంలో షర్మిలక్క ప్రసంగం:
- పోడు భూముల సమస్యను కేసీఆర్ పరిష్కరించకపోవడం సిగ్గుచేటు
- రైతులు తాతముత్తాల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్ని లాక్కోవడం దుర్మార్గం
- బలవంతంగా భూములు లాక్కొని రైతుల్ని తరిమేస్తున్నరు. కాళ్లావేళ్లా పడినా పట్టించుకోవడం లేదు
- పోడు భూముల సమస్యను ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ, కేసీఆర్ గానీ పట్టించుకోవడం లేదు
- వైయస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోడు భూములకు పట్టాలు ఇచ్చారు.
- 3.3లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చి ఆదుకున్నారు. మరో 3లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చారు
- వైయస్ఆర్ బతికే ఉంటే మిగిలిన భూములకూ పట్టాలు వచ్చేవి
- ఎనిమిదేండ్లుగా కేసీఆర్ అధికారంలో ఉన్నా ఏనాడూ పట్టించుకోలేదు
- ఎన్నికల సమయంలో మాట ఇచ్చి కూడా పరిష్కరించలేదు
- పోడు పట్టాలు ఇవ్వకపోగా ఉన్న భూములు గుంజుకుంటున్నారు
- మొక్కలు నాటడానికి, శ్మశాన వాటికలు కట్టడానికి రైతుల భూములే దొరికాయా?
- భూములు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ లో పెట్టి కొడతారా?
- మంచినీళ్లు, ఆహారం ఇవ్వకుండా తిప్పలు పెడతారా?
- ఉపాధి హామీ బిల్లులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి
- ఇక ప్రజలు గంజి తాగి బతకాలా? లేక ఆత్మహత్యలు చేసుకోవాలా?
- కేసీఆర్ కుటుంబమేమో పెద్ద పెద్ద కోటలు కట్టుకోవాలి, గడీల్లో బతకాలి
- ప్రజలేమో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాలి
- వాళ్లేమో రాజ్యాలు ఏలాలి
- సామాన్యులు మాత్రం బతకడానికి దిక్కు లేకుండా బాంచన్ దొర అని కేసీఆర్ కాళ్ల మీద పడాలి
- ఇదేనా బంగారు తెలంగాణ?
- వరి వేసుకుంటే ఉరేనని బెదిరించారు
- 17లక్షల ఎకరాల్లో రైతులు వరి వేయలేదు
- వడ్లు కొనుగోళ్లపై కేసీఆర్ ఊసరవెల్లిలా మాటలు మార్చాడు
- ఒకసారి సన్నొడ్లు వేయాలంటాడు. ఇంకోసారి వరి వేయొద్దు అంటాడు. మళ్లీ మేమే వండ్లు కొంటామని చెప్తాడు
- మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదు
- యాసంగిలో పండేది బాయిల్డ్ రైస్ అని తెలుసి కూడా ఢిల్లీలో సంతకం పెట్టాడు
- మెడలు వంచుతాను కొట్లాడుతాను అని ఢిల్లీకి వెళ్లాడు
- గంట సేపు ధర్నా చేసి మెడ దించుకుని ఓటమి ఒప్పుకుని నేనే కొంటాను అని వచ్చాడు
- కానీ కొనుగోలు సెంటర్లు ఇప్పటివరకు తెర్వలేదు
- 7వేల కొనుగోలు కేంద్రాలు ఉంటే 2వేలు ఓపెన్ చేశారు ఇందులో 100లోపే కొనుగోలు చేస్తున్నారు
- 60లక్షల టన్నులు వడ్లు కొనాల్సి ఉంటే కేవలం 2లక్షల టన్నులు మాత్రమే కొన్నారు
- రైతులు సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అకాల వానలతో వడ్లు తడుస్తున్నాయి.
- ఈ నష్టం ఎవరు భరించాలి? వడ్లు ప్రభుత్వం కొనకపోవడంతో అగ్గువకే దళారులకు అమ్ముతున్నా కేసీఆర్ కు సోయి లేదు
- ఎనిమిదేండ్లలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే దానికి కారణం కేసీఆర్
- రాష్ట్రంలో పంట నష్ట పరిహారం లేదు. రైతు బీమా లేదు. ఉచిత ఎరువులు ఇస్తానని మోసం చేశాడు
- రూ.25వేల విలువైన పథకాలు బంద్ పెట్టి కేవలం రూ.5వేల రైతు బంధు ఇచ్చి మభ్యపెడుతున్నాడు
- రూ.5వేలు ఇచ్చి రైతులు కోటీశ్వరులు అయ్యారని, కార్లలో తిరుగుతున్నారని చెబుతున్నారు
- 24గంటల ఉచిత కరెంట్ అని చెప్పి, 7గంటల కరెంటే ఇస్తున్నాడు
- రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దేశాన్ని ఏలబోతాడట
- అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులట. దేశానికి పోయి అజెండా మారుస్తాడట. రాజ్యాంగాన్ని మారస్తాడట. సిగ్గుండాలి ముఖ్యమంత్రికి. ఎవరు అడిగారు మిమ్మల్ని మార్చమని?
- ప్రజలు మళ్లీ మళ్లీ కేసీఆర్ చేతిలో మోసపోవద్దు
- ప్రజల కోసం పుట్టిన పార్టీ YSR తెలంగాణ పార్టీ
- ప్రజలకు వైయస్ఆర్ సంక్షేమ పాలన అందించేందుకే మేం పార్టీ పెట్టాం
- మీరు ఆశీర్వదిస్తే మళ్లీ సుపరిపాలన అందిస్తాం