ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో ‘మాట– ముచ్చట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడారు.
– మాట–ముచ్చట కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు చెప్పకుండా టీఆర్ఎ గుండాలు బెదిరిస్తున్నారట
– సమస్యలు చెప్తే పథకాలు నిలిపి వేస్తామని హెచ్చరిస్తున్నారట.. భయపెడుతున్నారట
– టీఆర్ఎస్ గూండాలకు సిగ్గుండాలి.. అంత భయం ఉంటే పథకాలు ఎందుకు అమలు చేయలేదు?
– స్థానిక ఎమ్మెల్యే గ్రామానికి కూడా బస్సు లేదంటే ఆయన పనితనం ఎలాంటిదో తెలుస్తోంది
– ఎమ్మెల్యేగా పదవి చేపట్టి కనీసం నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ కూడా తెచ్చుకోలేదు
– వైయస్ఆర్ గారు నమ్మకంగా సేవ చేశారు కాబట్టే కోట్ల మంది గుండెల్లో బతికే ఉన్నాడు
– ఎనిమిదేండ్లుగా కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు
– బంగారు తెలంగాణ అని చెప్పి, బతుకే లేని తెలంగాణ గా మార్చారు
– బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణ గా..ఆత్మహత్యల తెలంగాణ గా మార్చారు
– అధికార పార్టీ నేతలు పోలీసులను పనోళ్లుగా వాడుకుంటున్నారు
– రెండు సార్లు కేసీఆర్ కు ఓట్లు వేస్తే రెండు సార్లు ప్రజలను దగా చేశారు
– కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేస్తే వాళ్లంతా కేసీఆర్ సంకలో చేరారు
– కేసీఆర్ ను గద్దెదించడానికి... వైయస్ఆర్ సంక్షేమ పాలన కోసమే YSR తెలంగాణ పార్టీ పెట్టాం
– కేసీఆర్ అసమర్థ పాలన వల్లే YSR తెలంగాణ పార్టీ పుట్టింది. ప్రజలకు వైయస్ఆర్ పాలన అందించేందుకే పార్టీ పెట్టాం
– మేం అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. ఆరోగ్యశ్రీని బ్రహ్మాండం చేస్తాం
– మహిళలకు రుణాలు పంపిణీ చేసి, ఆర్థికంగా బలోపేతం చేస్తాం.-పేద వాళ్లకు ఇండ్లు నిర్మించి, మహిళల పేర్ల మీదనే రిజిస్ట్రేషన్ చేయిస్తాం
– ఉచిత విద్య, వైద్యంతో పాటు మన పిల్లలందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం.
– అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తాం.
– ఉద్యోగాలు భర్తీ చేసి, నిరుద్యోగ యువతకు అండగా ఉంటాం.
– బీసీ, ఎస్టీ, ఎస్సీ కార్పొరేషన్ల లోన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తాం.
– రైతులతో పాటు కౌలు రైతులకూ న్యాయం చేస్తాం.
– కేసీఆర్ అక్రమ అవినీతి పాలన పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి.