ప్రజాప్రస్థానంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి మండలంలోని రామనగరం గ్రామంలో రైతు గోస కార్యక్రమంలో షర్మిలక్క ప్రసంగం:
- ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే రాష్ట్రంలో పాలకులకు పేదలంటే గౌరవం లేదు, విలువ లేదు.
- ప్రతి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైతులు అప్పలు పాలవుతున్నారు.
- కేసీఆర్ రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకపోవడంతో ఆ రుణం అలాగే ఉంది.
- దీంతో బ్యాంకు వాళ్లు కొత్త రుణం ఇవ్వడంలేదు. రైతులు మళ్లీ బయట అప్పులు చేసుకోవాల్సి వస్తుంది.
ఎంత కష్టపడి వ్యవసాయం చేసినా ఏదో ఒక రకంగా రైతు నష్టపోతున్నాడు.
- పెరిగిన అప్పులతో ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
- పేద పిల్లల చదువులు, వృద్ధుల పెన్షన్లు, పేదలకు ఇండ్లు ఉన్నాయా? బియ్యం వస్తున్నాయా? అని పట్టించుకునే వారే లేరు.
- ఎన్నికల్లో గెలిచిన వారంతా డబ్బులకు అమ్ముడుపోతున్నారు, రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారు.
- పాలకులు నీళ్లు అమ్ముకుంటున్నారు, ఇసుకు అమ్ముకుంటున్నారు, భూములు కబ్జా చేసుకుంటున్నారు, ఫాం హౌజ్‌లు కట్టుకుంటున్నారు, భోగాలు అనుభవిస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి నానారకాలుగా హింసిస్తున్నారు.
- రైతులకు కనీసం భూమి పాస్ బుక్కులు కూడా ఇవ్వడం లేదు.
- ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకోసమేనా కొట్లాడింది.
- కేవలం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు వాళ్ల స్వార్థం కోసం , వాళ్ల రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలను నాశనం చేస్తున్నారు.
- ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ల శవాల మీద సింహాసనాలు వేసుకొని అధికారం అనుభవిస్తున్నారు.
- తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎడమ కాలి చెప్పు కింద వేసి తొక్కుతున్నారు.
- వరి వేసుకున్న రైతులు మద్దతు ధర ఇవ్వకపోవడంతో 12 వందలకు , 13 వందలకు అమ్ముకోవాల్సి వస్తుంది. పాలకులు పట్టించుకోకపోతే రైతులు ఎవరికి చెప్పుకుంటారు?
- వైయస్ఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశారు. ఉచిత విద్యుత్తు అందించారు.
- రాజశేఖర్ రెడ్డి గారు విత్తనాలు, ఎరువులకు సబ్సిడీ కల్పించారు.
- ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. పంట నష్టపోతే పరిహారంచెల్లించారు.
- బోర్లు వేసుకున్నా, డ్రిప్ సిస్టం ఏర్పాటు చేసుకున్నా రైతులకు సాయం చేశారు.
- కేసీఆర్ పాలనలో ఈ పథకాలు ఏవీ లేవు. రైతుల పంట నష్టపోతే పట్టించుకునే దిక్కే లేదు.
- 25 వేల రూపాలయలు వచ్చే పథకాలు బంద్ పెట్టి 5 వేల రైతు బంధు ఇస్తున్నారు.
- కేసీఆర్ ఇచ్చే 5 వేల రైతు బంధుతో రైతులు కోటీశ్వరులయ్యారట, కార్లలో తిరుగుతున్నారట.
- కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగుపడ్డారు, కేసీఆర్ కాకుండా ఎవరు కోటీశ్వరులయ్యారు.
- అద్దె ఇంట్లో ఉండే కేసీఆర్ వందల ఎకరాల ఫాం హౌజ్‌లు భోగాలు అనుభవిస్తున్నాడు, ఒకప్పుడు స్కూటర్లో తిరిగి ఇప్పుడు ప్రైవేటు ఎరోప్లేన్‌లో తిరుగుతున్నాడు.
- కేసీఆర్ ఇంట్లో ఐదుగురికి పదవులు ఉండాలి, మన పిల్లలు డిగ్రీలు, పీజీలు చదివి ఖాళీగా ఉండాలా?
- కేసీఆర్ గారి పిల్లలు రాజ్యాలు ఏలాలి, ఉన్నత చదువులు చదివిన పిల్లలు కూలీ పనులు చేసుకోవాలా?
- 60 ఏళ్లు దాటిన రైతులు చనిపోతే వచ్చే రైతు బీమా కూడా రావడం లేదు.
- కేసీఆర్ 69 ఏళ్లకు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కానీ రైతులు మాత్రం 60 ఏళ్లలోపే చనిపోవాలా?
- ఇంట్లో ఇద్దరు అర్హులుంటే ఒక్కరికే పెన్షన్ ఇవ్వకుండా ఒకరికే ఇస్తున్నారు.
- ఏళ్ల తరబడి అప్లికేషన్లు పెట్టి ఎంతోమంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు.
- ఎన్నికలు వస్తే పెన్షన్లు ఇస్తానంటాడు, ఎన్నికలు పూర్తయ్యాక ఆపేస్తాడు.
- పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదు.
- పిల్లలకు స్కాలర్షిప్స్ లేవు.
- పేదల వైద్యానికి ఆరోగ్య శ్రీ లేదు.
- చదువులకు ఫీ రీయింబర్స్ మెంట్ లేదు.
- దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ఇవ్వలేదు. ఇప్పుడు దళితబంధు అంటున్నాడు.
- దళితులకు ఇవ్వాల్సిన మూడెకరాల భూమి విలువ 30 లక్షలతో పాటు ఏడేళ్లుగా ఏటా పంటకు వచ్చే ఆదాయాన్ని కలుపుకొని 51 లక్షలు మరియు దళిత బంధు 10 లక్షలు కలపుకొని ప్రతి దళిత కుటుంబానికి కేసీఆర్ 61 లక్షలు బాకీ పడ్డారు.
- టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్ల కోసం వస్తే కాలర్ పట్టుకొని ముందు 61 లక్షలు కట్టిన తర్వాత ఓట్లు అడగమని చెప్పండి.
- ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వస్తుంది.
- ఆలోచన చేసి మీ భవిష్యత్తు కోసం ఆలోచించేవారికి, మీ మంచి కోసం పని చేసే వారికి ఓటు వేయండి.
- కేసీఆర్ లాంటి వాళ్లకు ఓటేస్తే ఇలాగే ఉంటుంది.
- కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ వాళ్లను పశువులను కొన్నట్లు కొనేశాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారు.
- కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ నాయకులు అయినా కేసీఆర్ కు అమ్ముడుపోయేవారే.
- ప్రశ్నించే వాళ్లు లేకనే ఎనిమిదేళ్లు కేసీఆర్ ఆడిందే ఆట , పాడిందే పాటగా సాగింది.
- బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తెలంగాణలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?
- అందుకే ఈ రోజు తెలంగాణ ప్రజల తరఫున పోరాటం చేయడానికి, ప్రజా సమస్యలను ఎత్తి చూపడానికి , ప్రజలకు అండగా నిలబడడానికే వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది.
- రాజశేఖర్ రెడ్డి గారు కుల , మతాలకు అతీతంగా పేదలు, రైతులు, మహిళల సంక్షేమానికి ఏ విధంగానైతే కృషి చేశారో మళ్లీ అలాంటి పరిపాలన తీసుకురావడానికే మేం పార్టీ పెట్టాం.
- ఈ రోజు వరి వేసిన రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క జనగాంలోనే 5 లక్షల టన్నుల ధాన్యం నానిపోయింది. పట్టించుకునేవారున్నారా?
- కేసీఆర్ సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే రైతులు ఇలా నష్టపోయేవారా?
- కేసీఆర్ ఎక్కడైనా వరికి మద్దతు ధర ఇచ్చి కొంటున్నాడా? కనీసం రైతులకు మద్దతు ధర ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం కేసీఆర్‌ది.
- పంట నష్టపోతే పరిహారం చెల్లించలేని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎందుకు ఉండాలి? ఈ మంత్రులు , ఎమ్మెల్యేలు , యంత్రాంగం ఎందుకు?
- రాష్ట్రంలో ప్రజత దుస్థితిని మార్చడానికే వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది.
- మాట తప్పని వైయస్ఆర్ బిడ్డగా మాటిచ్చి చెబుతున్నా మీరు ఆశీర్వదించండి వ్యవసాయాన్ని మేం పండుగ చేస్తాం.
- ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా , ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మాటిస్తున్నా.
- నిరుద్యోగులకు ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం.
- పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తాం.
- మళ్లీ ఆరోగ్య శ్రీని అమలు చేస్తాం.
- అర్హులైన వారందరికీ పెన్షన్ అందిస్తాం.
- ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ, పేద ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పని చేస్తుందని ఆఖరి క్షణం వరకూ మీకు సేవ చేస్తూనే చనిపోయిన వైయస్ఆర్ బిడ్డగా మీకు మాటిస్తున్నా.