ప్రజాప్రస్థానం పాదయాత్ర 1000 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గకేంద్రంలో షర్మిలక్క ప్రసంగం:
దొంగచేతికి తాళాలు ఇచ్చినట్లు.. కేసీఆర్ కు అధికారం ఇస్తే 4లక్షల కోట్ల అప్పులు చేసి బీడి బిచ్చం, కల్లు ఉద్దెరలా మార్చాడు. సింగరేణిని అప్పులపాలు చేశాడు. ఆర్టీసీని ఆగంజేశాడు. ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నడు. వడ్ల రైతులను అప్పుడు, ఇప్పుడు నిండా ముంచాడు. ఈదరిద్రం ఇక్కడితో చాలక దొరగారు దేశాలు ఏలబోతారట. కేసీఆర్ కు ఓటేస్తే తెలంగాణను అమ్మేసినట్లే. బీజేపోళ్లు కేసీఆర్ ను జైలులో పెడ్తామని ఊకదంపుడు ముచ్చట్లు తప్ప ఆధారాలు బయటపెట్టింది లేదు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని ప్రజలందరికీ తెలుసు. సత్తుపల్లిలో పచ్చపార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కేసీఆర్ కు అమ్ముడుపోయి కారెక్కాడు. దళితుడై దళితద్రోహిగా మారాడు.దళిత ముఖ్యమంత్రి, దళితలకు మూడెకరాల భూమి, 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం, దళితబంధు అని చెప్పి మోసం చేసిన కేసీఆర్ తో జతకట్టాడు. రాజ్యాంగం మార్చాలన్న ముఖ్యమంత్రితోనే ఉన్నాడు. సిగ్గులేకుండా ఆయన్ను పొగుడుతూ బతికేస్తున్నడు. ఇక్కడ దళితబంధు ఇవ్వకుండా, దేశం మొత్తం దళితబంధు అమలు చేయాలట.సత్తుపల్లి ప్రజలు ఇక్కడి ఎమ్మెల్యేను రాజకీయంగా నిలబడకుండా బుద్ధిచెప్పాలి. పాదయాత్ర ఎందుకని అంటున్నారు కదా.. కేటీఆర్, కేసీఆర్ కు సవాల్ విసురుతున్నా. నాతో పాదయాత్రకు రండి.. సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. ఉన్నాయని నిరూపిస్తే రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రిని చెయ్.