YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు సూర్యాపేట మార్కెట్ యార్డును పరిశీలించారు. రైతులు వడ్లు కొనడం లేదని తెలుసుకున్న షర్మిలక్క.. పాదయాత్రను తాత్కాలికంగా నిలుపుదల చేసుకొని, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వడ్లు తక్కువ ధరకే కొంటున్నారని, నాలుగైదు రోజులుగా కాంటాలు వేయకపోవడంతో రాత్రింబవళ్లు ఇక్కడే ఉంటున్నామని రైతులు వాపోయారు. దీంతో మార్కెట్ యార్డు ఆవరణలో బైఠాయించి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా షర్మిలక్క మీడియాతో మాట్లాడారు.
- రాష్ట్ర ప్రభుత్వం వడ్లు సకాలంలో కొనడం లేదని, సూర్యాపేట మార్కెట్ యార్డులో కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని తెలిసి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడికి రావడం జరిగింది.
- ఈ పరిస్థితి ఇక్కడ ఒక్కచోటే కాదు, యావత్ తెలంగాణ మొత్తం ఉంది.
- రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఇక్కడి అధికారులతో మాట్లాడటం జరిగింది.
- ఇప్పటి వరకూ 682 మంది వడ్లు అమ్మితే ఇద్దరికి మాత్రమే గిట్టుబాటు ధర పడింది అని అధికారులు చెబుతున్నారు.
- అసలు వడ్లకు కనీసం 1960 రూపాయలు మద్దతు ధర ఉంది.
- 682 మందిలో మిగిలినవాళ్లకు కనీస మద్దతు ధర కూడా దక్కలేదు.
- ఎంతోమంది రైతులు 1500లకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
- కొనుగోళ్లు సమయానికి జరగకపోవడంతో అయిదు రోజుల నుంచి మార్కెట్లో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది.
- పేపర్ మీద లేనిది కమీషన్ల రూపంలో రైతులను దబాయిస్తున్నారు.
- ఎంతోమంది రైతులు దిక్కులేని పరిస్థితిలో రూ.1200లకు కూడా అమ్ముకుంటున్నారు.
- రైతుల బలహీనతను అవసరానికి వాడుకుంటున్నారు.
- దళారులు, డీలర్లు రైతుల్ని దోపిడీ చేస్తూ నిండా ముంచుతున్నారు.
- తరుగు, తాలు, తేమ పేరుతో ఏదో ఒక సాకుతో వచ్చే దాంట్లో కోతలు విధిస్తున్నారు.
- రైతులు ఇంత దారుణంగా నష్టపోవడానికి కారణం కేసీఆర్.
- రైతు కష్టపడితేనే మనకు తిండి అలాంటి రైతులను పాలకులు గౌరవిస్తున్నారా?
- కేసీఆర్ తప్పు చేసిన తప్పుల వల్ల రైతులు శిక్ష అనుభవిస్తున్నారు.
- యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుందని తెలిసి కూడా కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ గారు సంతకం చేశారు.
- బీజేపీతో తత్సంబంధాలు ఉన్నప్పుడు రైతులు ఎలా పోతే నాకేంటని వాళ్ల లావాదేవీల కోసం సంతకం పెట్టారు.
- కేసీఆర్ గారు పెట్టిన ఆ ఒక్క సంతకం రైతుల పాలిట శాపమైంది.
- కేసీఆర్ సంతకం పెట్టి వచ్చి రైతులు వరి వేసుకుంటే ఉరే అన్నారు, రైతుల్ని బెదిరించారు.
- దీంతో పోయిన యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే, ఈసారి కేసీఆర్ మాట వల్ల 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరిసాగు చేశారు.
- 17 లక్షల ఎకరాల్లో రైతులు అన్నీ ఉండి వరి వేయగలిగి కూడా సాగు చేయకుండా వదిలేశారు.
- వరి వేయకుండా ఆ రైతులు, రైతు కూలీలు తీవ్రంగా నష్టపోయారు.
- నష్టపోయిన రైతులకు, రైతు కూలీలకు కేసీఆర్ నష్టపరిహారం చెల్లించాలి.
- ఈ పరిహారాన్ని కూడా కేసీఆర్ సొంత డబ్బుల నుంచి ఇవ్వాలి.
- కేసీఆర్ ఏనాడు రైతుల సంక్షేమం గురించి ఆలోచించలేదు.
- ఈరోజు రైతులు పండించిన 35 లక్షల ఎకరాల వడ్లని కూడా సకాలంలో కొంటలేరు.
- ఏదో ఒక కారణాలు చెబుతూ కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారు.
- రైతులు రోజుల తరబడి మార్కెట్ యార్డులో వడ్ల కుప్పల వద్దనే ఉండాల్సి వస్తుంది.
- కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎవరి పక్షాన ఉండాలి?
- ఓట్లు వేసిన రైతుల పక్షాన ఉండాలా? లేక దళారులు, డీలర్ల పక్షాన ఉంటారా?
- రైతులు కష్టపడి పండించిన పంటకు కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు.
- మద్దతు ధర పొందడం రైతుల హక్కు
- మద్ధతు ధర ఉన్న పంటను వేసుకునే హక్కు రైతులకు ఉంది. పండించిన తర్వాత మద్దతు పొందడం కూడా రైతుల హక్కు.
- రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎవరిని ఉద్దరించడానికి ఉన్నట్లు ఈ ముఖ్యమంత్రి?
- రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి వడ్లు కొంటామని ప్రకటించినందుకు అభినందన సభలట.. సిగ్గుండాలి కదా?
- కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తప్పుడు సంతకం పెట్టిన సన్నాసి ఎవరు?
- వరి వేసుకుంటే ఉరేనని బెదిరించిన సన్నాసి ఎవరు?
- సంతకం పెట్టింది కాక ఢిల్లీకి పోయి గంట సేపు ధర్నా చేసి ఓటమి ఒప్పుకున్న సన్నాసి ఎవరు?
- కేసీఆర్ సమయానికి కొనకపోవడం వల్లనే కదా వానలొస్తే వడ్లు తడిచాయి?
- కేసీఆర్ తప్పులు చేస్తే రైతులు శిక్ష అనుభవిస్తున్నారు.
- ప్రభుత్వం నడిపించే మార్కెట్ లోనూ రైతులకు మద్దతు ధర దక్కడంలేదు.
- రైతులు ఇంత కష్టపడి పంట సాగు చేస్తే కనీసం మద్దతు ధర రూ.1960 కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఇది.
- రూ.5 వేల రైతు బంధు ఇచ్చి రైతులు కోటీశ్వరులు అయ్యారని కేసీఆర్ చెబుతున్నారు.
- రూ.25 వేల పథకాలు బంద్ పెట్టి రైతులను నిండా ముంచిన రైతు ద్రోహి కేసీఆర్.
- ఇప్పటికే కేసీఆర్ గారు రైతుల విషయంలో తప్పుల మీద తప్పులు చేశారు.
- రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ఇప్పటికైనా మద్దతు ధర ఇచ్చి వెంటనే వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్నాం.
- తరుగు , తాలు, తేమ పేరుతో ఎలాంటి కటింగ్లు చేయకుండా రైతులందరికీ మద్దతు ధర చెల్లించి కేసీఆర్కు గుండె ఉందని, కేసీఆర్ మనిషేనని నిరూపించుకోవాలి.