YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు ఈరోజు లోటస్ పాండ్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాల గురించి ప్రభుత్వాన్ని నిలదీశారు. వడ్ల కొనుగోళ్లలో జాప్యంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ..
– పంట పండించడం ఒక ఎత్తు అయితే దానిని అమ్ముకోవడం ఇంకొక ఎత్తు
– ఎక్కడికి వెళ్లినా వడ్లు కొంటారనే నమ్మకం లేదు
– ఆరు నెలలుగా వరి వేసిన రైతులు బిక్కుబిక్కుమంటూ బతికారు
– కేసీఆర్ వడ్లు కొనమని చెప్పడంతో రైతులు నిండా మునిగారు
– వరి వేసిన రైతులు ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు
– వరి వేయని రైతులు అయ్యో మేము వరి వేయలేదే అని బాధపడుతున్నారు
– పాదయాత్రలోనూ నెల రోజులుగా రైతుల పక్షాన పోరాడుతున్నాం
– ప్రతి రోజూ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాం
– కొన్నిరోజులుగా పాదయాత్రను పక్కన పెట్టి కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది
– అయిదు రోజులుగా రైతులు కల్లాల్లోనే తమ ధాన్యం వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది
– ఇంత కష్టపడి పంటలు పండిస్తే రైతులకు మాత్రం 1400 కంటే తక్కువగా వడ్లు కొంటున్నరు
– రూ.1960 మద్దతు ధర అని బయట బీరాలు పలికి అగ్గువకే వడ్లు కొంటున్నరు
– తెచ్చిన పంటను వెనక్కి తీసుకెళ్లలేక, రైతులు తక్కువకే అమ్ముకుంటున్నరు
– కేసీఆర్ జిల్లాలోనే వడ్లు కొనకపోవడం సిగ్గుచేటు. రైతులను కనీసం పట్టించుకోవడం లేదు
– 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు
– అన్నం పెట్టే రైతును ఇలాగేనా చూసుకునేది?
– 65టన్నుల్లో ఇప్పటివరకు ఎన్ని టన్నులు కొన్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలి
– 7వేల కొనుగోలు కేంద్రాల్లో ఎన్ని తెరిచారు? ఎన్నింట్లో కొనుగోలు చేస్తున్నారు?
– ఇప్పటివరకు 10శాతం మాత్రమే వడ్లు కొన్నారు.
– ఇంక సిగ్గులేకుండా తమది రైతు ప్రభుత్వమని కేసీఆర్ చెబుతున్నాడు
– కేవలం రూ.5వేలు రైతు బంధు ఇచ్చి, రూ.25 వేల విలువైన పథకాలు బంద్ పెట్టారు
– వైఎస్సార్ గారు మద్దతు ధర మీద 25శాతం బోనస్ ఇచ్చి కొన్నారు.
– కనీసం మద్దతు ధర కూడా ఇవ్వలేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ ది
– కేసీఆర్ వల్ల ఎనిమిదేండ్లలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
– 60 ఏండ్ల దాటిన రైతులకు రైతు బీమా కూడా ఇవ్వడం లేదు.
– గౌరవం సంగతి పక్కన పెడితే.. రైతుకు తెలంగాణలో విలువే లేకుండా చేశారు
– ఇక కొనుగోళ్లపై ప్లీనరీలో అభినందన తీర్మానమట. కేసీఆర్ కు సిగ్గు ఉండాలి. రైతుల పాలిట యముడిలా మారినందుకా మీ తీర్మానం?
– ఢిల్లీ కి వెళ్లి మొహం దించుకొని వచ్చిన సన్నాసి కేసీఆర్
– వరి వేస్తే ఉరి అని చెప్పి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిన సన్నాసి కేసీఆర్
– కేసీఆర్ వల్ల వరి వేయని రైతులకు ఎకరాకు రూ.25వేలు చెల్లించాలి
– కేసీఆర్ మేల్కొవాలి.. ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలి
– రైతుల మీద కాంగ్రెస్ పార్టీ కి అవగాహన లేదు. మేలు చేయాలని ఆలోచన లేదు
– కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ ఎందుకు చేయలేదు?
– ప్రజలకు తెలుసు..కాంగ్రెస్ పార్టీ కి ఓటేస్తే టీఆర్ఎస్ కి అమ్ముడు పోతారని..
– రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఒక దొంగను తీసుకొచ్చి, టీపీసీసీ చీఫ్ గా పెట్టారు
– రేవంత్ గురించి ఆ పార్టీ నేతలకే తెలుసు.
– కేసీఆర్ ఒక దొరలా.. కేటీఆర్యువరాజు లా ఫీల్ అవుతున్నారు
– గవర్నర్ రాజకీయ చేస్తుంది అని కించ పరుస్తున్నారు
– గవర్నర్ కి విలువ ఇస్తే మీకు పోయేది ఏముంది?
– బండి సంజయ్ కి పాదయాత్ర లో వరి రైతుల కష్టాలు కనిపించడం లేదా...?
– బీజేపీ తప్పులు కప్పి పుచ్చుకుంటుంది
– బీజేపీ ఇస్తామని చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలు ఏవి?