ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూర్ మండలం కల్లూరుగూడెం గ్రామంలో నిర్వహించిన ‘రైతు గోస’ కార్యక్రమంలో షర్మిలక్క ప్రసంగంః
- వైయస్ఆర్ హయాంలో వ్యవసాయం అంటే పండుగ. ప్రతి రోజూ సంక్రాంతిలా ఉండేది.
- వైయస్ఆర్ రైతు పక్షపాతి. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత కరెంట్ పైనే మొదటి సంతకం చేశారు
- విద్యుత్ బకాయిలను మాఫీ చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన వైయస్ఆర్
- రైతులకు ఏం కష్టం వచ్చినా వైయస్ఆర్ ఆదుకున్నారు
- పంట నష్టపోతే పండిన దానికంటే ఎక్కువ పరిహారం ఇచ్చారు
- ప్రతీ కుటుంబం, ప్రతి గ్రామం వైయస్ఆర్ హయాంలో కళకళలాడింది
- వైయస్ఆర్ లక్షల కుటుంబాలను ఋణ విముక్తులను చేసి అప్పుల నుంచి గట్టెక్కించారు
- కేసీఆర్ ను రెండు సార్లు ముఖ్యమంత్రి గా ఎన్నుకుంటే ఏం చేశారు?
- ఏ కుటుంబానికి మేలు చేయని సీఎం ఎందుకు ఉన్నట్లు?
- ఎన్నో వాగ్దాదానాలు ఇచ్చారు..ఒక్కటైనా నెరవేరిందా?
- రుణమాఫీ అని రైతులను మోసం చేశారు
- పోడు పట్టాలు అని గిరిజనులను మోసం చేశారు
- డబుల్ బెడ్ రూం అని మోసం చేశారు
- ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు
- తెలంగాణలో రైతులు అప్పుల పాలయ్యారు
- సీజన్ తర్వాత సీజన్ లో అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
- కేవలం రూ.5 వేల రైతు బందు ఇస్తే రైతు ఏం చేసుకోవాలి? దీనితో రుణమాఫీ తీరుతుందా?
- రైతులకు సబ్సిడీ పథకాలు బంద్ పెట్టి, 5 వేలు ఇచ్చి రైతులను కోటీశ్వరులు చేస్తున్నామని చెబుతున్నారు
- 25 వేలు ఇచ్చే సబ్సిడీ పథకాలు అన్ని బంద్ పెట్టారు
- రాష్ట్రంలో రైతులు పంట నష్టపోతే పరిహారం కూడా దక్కడం లేదు
- కేసీఆర్ దిక్కుమాలిన ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతోంది
- రైతు బీమాకు 59 ఏండ్ల వయో పరిమితి ఎందుకు?
- కేసీఆర్ మాత్రం 69 ఏళ్లలోనూ పదవులు అనుభవించవచ్చు
- రైతులు మాత్రం 60 ఏండ్లకే చనిపోవాలని కోరుకుంటున్నారా?
- ఉద్యోగాలు ఇవ్వకుండా ..గొర్రెలు బర్రెలు కాచుకోమని చెప్తున్నారు
- డిగ్రీలు, పీజీలు చదివి హమాలీ పనులు చేస్తున్నారు
- మన బిడ్డలు చేపలు పట్టాలి..కేసీఆర్ బిడ్డలు మాత్రం రాజ్యాలు ఏలాలి
- కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ మొత్తం నాశనం అవుతుంది
- కేసీఆర్ కు ఓటేస్తే భవిష్యత్ మనల్ని క్షమించదు
- పాలకులు మంచివాళ్ళు అయితేనే ప్రజలు చల్లగా ఉంటారు
- వైయస్ఆర్ లాంటి న్యాయకత్వం కోసమే పార్టీ పెట్టాను
- కాంగ్రెస్ పార్టీ కి ఓటేస్తే ఆ నాయకులు టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారు
- బీజేపీ కి ఓటేస్తే అభివృద్ధి మరచి, మతతత్వ రాజకీయాలు చేస్తారు
- బీజేపీ ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు
- విభజన హామీలు ఒక్కటి కూడా బీజేపీ నెరవేర్చలేదు
- రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసింది
- YSR తెలంగాణ పార్టీని దీవించిన రోజున వ్యవసాయం పండుగ చేస్తాం
- ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద ఇల్లు ఇస్తాం
- మొట్టమొదటి సంతకం ఉద్యోగాల కల్పన మీదే
- ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ పెన్షన్ అందిస్తాం
- ఎస్సీ, ఎస్టీ బీసీల అభివృద్ధి కోసం పని చేస్తాం
- తెలంగాణ సంక్షేమం కోసం పని చేస్తా