- రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా సమస్యలే
- కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు
- ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇల్లు, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు, మూడెకరాల భూమి..ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మోసాలే
- రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు.
- ఆ బియ్యం కూడా ప్రజలు తినలేనివే
- డిగ్రీలు, పీజీలు చదివి కూలీ పనులు చేసుకుంటున్నారు
- కేసీఆర్ తీరుతో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
- వ్యవసాయానికి వైఎస్సార్ ఇచ్చే పథకాలు అన్ని బంద్ పెట్టి ముష్టి 5 వేలు ఇస్తున్నారు
- కేంద్రం వద్ద తప్పుడు సంతకం పెట్టి 17 లక్షల ఎకరాలను పడావు పడేలా చేశాడు
- వైఎస్సార్ సంక్షేమం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ
- పెద్దాయన పాలన తెస్తానని మీకు మాట ఇస్తున్నా..
- వైయస్ఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు అమలు చేస్తాం
- ఉద్యోగ నోటిఫికేషన్లపైనే తొలి సంతకం. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి.
- ఇంట్లో ఒక్కరి కంటే ఎక్కువ మంది అర్హులుగా ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు.
- ఆసుపత్రుల్లో కట్టిన కరోనా బిల్లులు తిరిగి చెల్లింపు. బాధితులకు అండగా YSR తెలంగాణ పార్టీ.
- ప్రజలందరికీ ఉచిత విద్య
- పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు.
- అర్హులైన రైతులకు పోడు పట్టాల పంపిణీ చేసి
- ఇల్లు లేని పేదలకు ఇండ్ల నిర్మాణం. ఆ ఇంటి మహిళ పేరు మీదనే రిజిస్ట్రేషన్.
- ప్రజలకు ఉచిత వైద్యం.. ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి, 108, 104 సర్వీసుల పునరుద్ధరణ.
- పంటలకు గిట్టుబాటు ధర. కౌలు రైతులు, రైతు కూలీల సంక్షేమానికి కృషి.
- మహిళలకు రుణాలు పంపిణీ చేసి, ఆర్థికాభివృద్ధి సాధించేలా తోడ్పాటు.