తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం తాళ్లపెంట గ్రామంలో YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతం జనగణమన పాడారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులను గుర్తు చేసుకున్నారు. అంతకుముందు వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.