- ఒక్క విగ్రహం తొలగిస్తే వెయ్యి విగ్రహాలు పెడతాం
- టీఆర్ఎస్ లీడర్లను, కేసీఆర్ ను ఉరికిచ్చి కొడతాం
- విగ్రహాన్ని తీసేస్తుంటే పోలీసులు గాజులేసుకుంటున్నారా?
- టీఆర్ఎస్ తీరుపై నిప్పులు చెరిగిన షర్మిలక్క
ప్రజాప్రస్థానం పాదయాత్ర 1200 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలం ఆత్కూర్ గ్రామంలో YSR తెలంగాణ పార్టీ నాయకులు దివంగత మహానేత వైయస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పాదయాత్ర గ్రామానికి చేరుకునేలోపే టీఆర్ఎస్ గుండాలు వైయస్ఆర్ విగ్రహాన్ని తొలగించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ తీరుపై పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ వైయస్ఆర్ విగ్రహాన్ని తొలగించగలరు గానీ ప్రజల గుండెల్లో ఉన్న అభిమానాన్ని ఎప్పటికీ తొలగించలేరు. మీరు ఒక్క విగ్రహాన్ని తొలగిస్తే మేం వెయ్యి విగ్రహాలు పెడతాం. వైయస్ఆర్ విగ్రహంపై చేయి వేస్తే టీఆర్ఎస్ లీడర్లను, కేసీఆర్ ఉరికించి కొడతాం. పోలీసుల అనుమతితోనే విగ్రహాన్ని పెట్టుకున్నాం. విగ్రహం తీసేస్తుంటే పోలీసులు గాజులు వేసుకున్నారా? మీరు రక్షకులా లేక టీఆర్ఎస్ పార్టీకి పని వాళ్లా? కేసీఆర్ ను హెచ్చరిస్తున్నాం. మీకు చేతనైతే వైయస్ఆర్ లా పాలన చేయండి. పథకాలు అమలు చేసి చూపించండి.అంతేకానీ వైయస్ఆర్ విగ్రహాల మీద చేతులు వేస్తే చేతులు విరగ్గొడతాం. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. కేసీఆర్ ది దెయ్యం పాలన, వైయస్ఆర్ ది దేవుని పాలన.’’ అంటూ దుయ్యబట్టారు.