- మీ అభిమానమే 12 వందల కిలోమీటర్లు నన్ను నడిపించింది
- నడిచింది నేనే అయినా...నడిపించింది మాత్రం మీరే
- వైయస్ఆర్ గారు ఏ పథకమైనా ప్రజలకోసమే చేశారు
- మధిర నియోజకవర్గం దళిత నియోజకవర్గం అని వైయస్ఆర్ ఎక్కువ శ్రద్ధ పెట్టారు
- రెండు వేల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఖర్చు పెట్టారు
- ఈ నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలకు రోడ్లు వేశారు.
- అండర్ బ్రిడ్జీలు కట్టించారు
- వైయస్ఆర్ బతికి ఉంటే జాలముడి ప్రాజెక్ట్ పూర్తి చేసేవారు
- వేల ఎకరాలకు సాగు నీరు, వందల గ్రామాలకు తాగునీరు అందేది
- వైయస్ఆర్ మరణం తర్వాత ఆ ప్రాజెక్ట్ ను పట్టించుకున్న వారే లేరు
- పక్కనే మున్నేరు, వైరా నది ఉన్నా తాగు నీరు, సాగు నీరు అందటం లేదు
- మధిరలో లెదర్ పరిశ్రమ అన్నారు... అది కూడా లేదు
- పాల పరిశ్రమ కూడా తెస్తాం అన్నారు.. తేలేదు
- గ్రామాలకు బస్సులు కూడా తీసేశారు
- మంచినీళ్ళు కూడా లేవు కానీ..మద్యం మాత్రం ఏరులై పారుతుంది
- మధిర నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలో సైన్స్ గ్రూప్ లేదు
- సైన్స్ గ్రూప్ చదవాలి అంటే ఖమ్మం వెళ్ళాలి
- బడ్డీ కొట్టు పెట్టుకున్న 600 మందిని రోడ్డున పడేశారు
- వైయస్ఆర్ గారు 5లక్షల మంది దళిత విద్యార్థులకు ఉచితంగా పెద్ద చదువులు చదివించారు
- 200 గర్ల్స్ హాస్టల్స్ నిర్మించారు
- కార్పొరేషన్ల ద్వారా ప్రత్యేక లోన్లు ఇచ్చారు
- ఏ పథకం అయినా దళితులకు పెద్దపీట వేశారు
- ముఖ్యమంత్రి కేసీఆర్ కు దళితుల మీద ప్రేమలేనే లేదు
- దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు అన్ని మోసాలే
- కేసీఆర్ దళితున్ని పక్కన కూడా పెట్టుకోడు
- కేసీఆర్ హయాంలో దళితుల మీద దాడులు 800 శాతం పెరిగాయి
- నేరేళ్ల ఘటన లో దళితులపై దాడి చేయించారు. జైల్లో పెట్టించారు
- మరియమ్మ అనే దళిత మహిళను జైల్లో చంపేశారు
- దళిత ముఖ్యమంత్రి హామీ పత్తా లేకుండా పోయింది
- కేసీఆర్ తల నరుక్కుంటా కానీ మాట తప్పను అని ఎన్నిసార్లు చెప్పలేదు?
- కేసీఆర్ రెండు సార్లు గెలిచినా రెండు సార్లూ ప్రజలను మోసం చేశారు
- కేసీఆర్ తర్వాత ఆయన కొడుకు...తర్వాత మనువడు ముఖ్యమంత్రి అవుతారట
- దళితులకు మాత్రం ముఖ్యమంత్రి పదవి ఇవ్వడట
- దళితులకు మూడెకరాల భూమి హామీ కూడా కేసీఆర్ నెరవేర్చలేదు
- సిద్దిపేట లో వైయస్ఆర్ దళితులకు పంచిన భూముల్లోనే కలెక్టరేట్ కట్టారు
- దళితులకు న్యాయం చేసింది వైయస్ఆర్ మాత్రమే
- కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు
- రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు రూ.3వేలు ఇలా అన్నీ హామీలు ఇచ్చి నెరవేర్చలేదు
- ముష్టి 5వేల రైతు బంధు ఇస్తూ.. వ్యవసాయానికి సంబంధించిన రూ.25వేల విలువైన పథకాలు బంద్ పెట్టిండు
- రైతు బీమా పథకానికి 60 ఏండ్ల వయో పరిమితి ఎందుకు?
- 60 ఏండ్లకే రైతులు చనిపోవాలని కేసీఆర్ కోరుకుంటున్నారా?