కోదాడ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిలక్క ప్రసంగం:
– నల్లగొండ జిల్లాను వైయస్ఆర్ గారు అన్ని విధాలా అభివృద్ధి చేశారు
– రూ.500కోట్లతో మహాత్మాగాంధీ యూనివర్సిటీని కట్టారు
– రూ.200కోట్లతో బీబీ నగర్ నిమ్స్ మెడికల్ కాలేజీని నిర్మించారు
– ఎనిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కట్టి, వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు
– మరి కేసీఆర్ ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చారా?
– జిల్లాలకు పాలిటెక్నిక్ కాలేజీ ఇస్తామని మోసం చేశారు
– వంద పడకల హాస్పిటల్ కట్టిస్తామని దగా చేశారు
– స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ ను ప్రశ్నించకుండా గాడిదలు కాస్తున్నారా?
– ఇక్కడి ఎమ్మెల్యే మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం, లిక్కర్ వ్యాపారమట
– అధికారులంతా ఆయన కాళ్ల కింద ఉండాలట
– ఒక బీసీ ఎమ్మెల్యే అయి ఉండి, అవినీతికి పాల్పడడం సిగ్గుండాలి కదా?
– బీసీల తరఫున ఒక్కసారి అయినా అసెంబ్లీలో నోరెత్తాడా?
– ఇప్పటివరకు బీసీ పేదలకు కార్పొరేషన్ లోన్లు లేవు.
– బీసీ స్టూడెంట్లకు స్కాలర్ షిప్లు లేవు.
– బీసీలు ఓట్లు వేస్తేనే కదా ఆయన ఎమ్మెల్యే అయింది?
– మరి బీసీలను అభివృద్ధి చేయాల్సిన చిత్తశుద్ధి లేదా?
– డబ్బు సంపాదించుకోవడమే ఎజెండాగా ఎమ్మెల్యే పనిచేస్తుండు
– కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు.
– పూర్తి రుణమాఫీ అని రైతులను మోసం చేశారు.
– కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశారు.
– మూడెకరాల భూమి ఇస్తానని దళితుల్ని మోసం చేశారు. దళితబంధు ఇస్తానని మోసం చేశారు.
– ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని ముస్లింలనూ మోసం చేశారు.
– పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మోసం చేశారు.
– ఇంటికో ఉద్యోగమని యువతను మోసం చేశారు. నెలకు రూ.3016 నిరుద్యోగు భృతి అని నిరుద్యోగులనూ మోసం చేశారు.