కోదాడ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిలక్క ప్రసంగం:
– పేద పిల్లలను మేధావులుగా తీర్చిదిద్దాలని వైయస్ఆర్ గారు బాసరలో ట్రిపుల్ ఐటీ నెలకొల్పారు
– ట్రిపుల్ ఐటీ వల్ల పేదింటి బిడ్డలు ఆణిముత్యాలుగా మారుతారని, నాతో ఎన్నోసార్లు వైయస్ఆర్ అన్నారు
– కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అక్కడ కనీస సౌకర్యాలు లేవు
– రోజుల తరబడి ఎండనక, వాననక విద్యార్థులు ధర్నా చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు
– పైగా ధర్నా చేయవద్దని విద్యార్థులను బెదిరిస్తున్నారు.
– ఉచిత విద్య, వైద్యం హామీలకే పరిమితమైంది
– కేసీఆర్కు ఎనిమిదేండ్లుగా ఉద్యోగాలు భర్తీ చేసే తీరక లేదు.
– కండ్ల ముందే 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా కనిపిస్తున్నా నోటిఫికేషన్లు వేయడం లేదు
– కేసీఆర్ తీరుతో వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
– చందమామలాంటి పిల్లలు చనిపోతున్నా కేసీఆర్ కు సోయి లేదు. చీమ కుట్టినట్లు కూడా లేదు
– ఉద్యమ సమయంలో నా కొడుకు, కూతురు అమెరికాలో సెటిల్ అయ్యారు? నాకు ఉద్యమం తప్పా ఇంకేం వద్దు అన్నారు కదా?
– మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? తానే గద్దెనెక్కి, కొడుకు, కూతురితో పాటు అల్లుడ్లకు కూడా పదవులు ఇస్తున్నాడు
– ఏం త్యాగాలు చేశారని వారికి పదవులు ఇచ్చారు?
– కొడుకుకు మంత్రి పదవి, కూతురు, అల్లుడికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాడు. మేనల్లుడికి మంత్రి పదవులు ఇచ్చాడు
– మరి బోగాలు ఎవరివి? త్యాగాలు ఎవరివి?
– డిగ్రీలు, పీజీలు చేసిన విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతున్నారు. అమ్మాయిలైనే పత్తి, మిరప ఏరడానికి పోతున్నారు
– తల్లిదండ్రులు కూలీనాలీ చేసి చదివించింది ఇందుకేనా?
– మూడేండ్లు కర్రసాము నేర్చుకుని, మూలకున్న ముసలిదాన్ని కొట్టినట్లు.. ఎనిమిదేండ్లుగా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా 80వేల ఉద్యోగాలంటూ బయటికొచ్చాడు
– అది కూడా మేం కొట్లాడిన తర్వాతనే నోటిఫికేషన్లు వచ్చాయి. మేం పోరాడితేనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉందని తెలిసింది
– కేసీఆర్ హయాంలో కాంట్రాక్టు ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాలు రోడ్డున పడ్డాయి