రైతునేస్తం మన షర్మిలక్క
ప్రజాప్రస్థానంలో భాగంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు కోదాడ నియోజకవర్గం నడిగూడ మండలంలో ట్రాక్టర్ నడిపారు. రైతులతో కలిసి దుక్కి దున్నారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. డీజిల్, ఎరువుల ఖర్చులు పెరిగాయని, పెట్టుబడి రెండింతలైందని వాపోయారు.కష్టపడి పంట పండిస్తే చివరికి మద్దతు ధర కూడా రావడం లేదన్నారు.సమస్యలు తెలుసుకున్న షర్మిలక్క వారికి భరోసా కల్పించారు. అధికారంలోకి వచ్చాక వైయస్ఆర్ లా ఎవుసాయాన్ని పండుగ చేస్తామన్నారు.