ఘనంగా మహానేత వైయస్ఆర్ జయంతి
- పంజాగుట్టలోని వైయస్ఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన షర్మిలక్క
- పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
- కేక్ కట్ చేసి సంబురాలు
దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు YS రాజశేఖర రెడ్డి గారి 73వ జయంతి వేడుకల్ని పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పంజాగుట్టలోని వైయస్ఆర్ విగ్రహానికి పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో YSR తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.