YSR 73వ జయంతి, YSR తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో YS షర్మిల గారి ప్రసంగం::
- ప్రజలకు YSR 73వ జయంతి శుభాకాంక్షలు మరియు YSR తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
- ఏడాది కాలంలో పార్టీ చేపట్టిన అనేక ఉద్యమాలకు, పోరాటాలకు మద్దతు తెలిపిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు
- రైతుల తరఫున పోరాటం చేశాం. రైతు ఆవేదన యాత్ర, రైతు గోస దీక్షలు చేపట్టాం
- పోడు పట్టాల కోసం ఉద్యమించాం
- దళితుల కోసం దళిత భేరి నిర్వహించాం. బీసీల కోసం బీసీ సభ నిర్వహించాం.
- ఫీల్డ్ అసిస్టెంట్ల తరఫున నిలబడ్డ ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ
- నిరుద్యోగుల కోసం 31 నిరాహార దీక్షలు చేశాం. ఇంకా చేస్తున్నాం
- మా పోరాటంతోనే మొన్న కేసీఆర్ గారి సోయి వచ్చి 80వేల ఉద్యోగాలు భర్తీ చేశారు
- ప్రజాప్రస్థానం పాదయాత్రలో అనేక సమస్యలను ఎత్తిచూపాం
- మాట-ముచ్చట ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నాం
- వడ్ల కొనుగోళ్లపై అనేక ధర్నాలు చేపట్టాం
- కాంగ్రెస్ పార్టీని వైయస్ఆర్ గారు రెండు సార్లు గెలిపించారు. కానీ వైయస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ వైయస్ఆర్ గారి కోసం చేసిందేమీ లేదు
- వైయస్ఆర్ గారు ఇచ్చిన అధికారాన్ని దర్జాగా అనుభవించారు తప్పితే.. వైయస్ఆర్ గారిని స్మరించుకునేందుకు సెంటు భూమి కూడా కేటాయించలేదు
- మహానేతకు నివాళి అర్పించుకోడానికి ఒక మెమోరియల్ ను కూడా ఏర్పాటు చేయాలేదు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే
- రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. వైయస్ఆర్ ఘాట్ కోసం ప్రసాద్ ఐమాక్స్ పక్కన 20 ఎకరాల భూమి కేటాయించామన్నారు
- ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు
- వైయస్ఆర్ గారు ఏ పథకం ప్రవేశపెట్టినా.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ గారి పేర్లు పెట్టి, వాళ్ల పేర్లు చిరస్థాయిలో నిలిచేలా చేశారు
- మరి వైయస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, మంత్రులు ఒక్క పథకానికైనా వైయస్ఆర్ పేరు పెట్టారా?
- వైయస్ఆర్ కోసం ఒక్క పని చేయకపోగా.. మరణించిన వ్యక్తి మీద ఎఫ్ ఐఆర్ లో వైయస్ఆర్ పేరును కాంగ్రెస్ పార్టీ చేర్చింది
- కాంగ్రెస్ పార్టీ వైయస్ఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది. కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది కాబట్టే.. కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది
- ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కూడా వైయస్ఆర్ గారికి అన్యాయం చేశారు. వైయస్ఆర్ గారు సీఎల్పీ నేతగా ఉన్నప్పుడే తెలంగాణ వాదాన్ని వినిపించడానికి 40మందితో సంతకాలు పెట్టి, పంపించిన నాయకుడు వైయస్ఆర్ గారు
- యూపీఏ మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చింది కూడా వైయస్ఆర్ గారే.
- 2004లో వైయస్ఆర్ గారే కేసీఆర్ ను కేంద్ర మంత్రిని చేశారు. ఓడిపోయిన హరీశ్ రావును మంత్రిని చేశారు
- వైయస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏ పథకం ప్రవేశపెట్టినా తెలంగాణకు పెద్దపీట వేశారు
- కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వైయస్ఆర్ మెమోరియల్ కు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకున్నారు
- వైయస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీని అమలు చేస్తామని చెప్పి, ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారు
- వైయస్ఆర్ మరణిస్తే.. సింహభాగం తెలంగాణ ప్రజలే చనిపోయారు అంటే తెలంగాణకు ఆయన చేసిన అభివృద్ధి ఏంటో తెలుస్తోంది
- వైయస్ఆర్ మెమోరియల్ కోసం స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం
- వైయస్ఆర్ మంత్రివర్గంలో పనిచేసిన వారు నేడు టీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా ఉన్నా వైయస్ఆర్ కోసం గజం జాగ కూడా కేటాయించలేదు
- కేసీఆర్ కు వైయస్ఆర్ పేరు నిలబడాలనే ఉద్దేశం లేదు.
- వైయస్ఆర్ పేరు కోసం పనిచేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్న దొంగ మాటలు నమ్మే వారు లేరు
- రేవంత్ రెడ్డి ఒక దొంగ, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వాడు.
- తెలంగాణ వస్తే వీసీలు తెచ్చుకోవాలని వైయస్ఆర్ ఊరికే అనలేదు. కేసీఆర్ రెచ్చగొట్టే ప్రసంగం వల్లే వైయస్ఆర్ అలా మాట్లాడాల్సి వచ్చింది.
- వైయస్ఆర్ చెప్పిన మాటలే వినిపిస్తున్నాయి కానీ కేసీఆర్ చెప్పిన మాటలు వినిపించవా?
ఆంధ్రా సంస్థలను పంపిస్తాం. ఆంధ్రా వాళ్లను వెళ్లగొడతాం అని కేసీఆర్ అంటేనే వైయస్ఆర్ అలా మాట్లాడాల్సి వచ్చింది
- ప్రత్యేక తెలంగాణ కోసం నిజంగా కొట్లాడిన వ్యక్తి వైయస్ఆర్. శాంతియుతంగా తెలంగాణ ఏర్పడాలని కోరుకున్న వ్యక్తి వైయస్ఆర్. కేసీఆర్ రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే అనేక మంది ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు
- వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీ చేస్తాం. అందులో ఎలాంటి అనుమానం లేదు