భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తుడి దేవేందర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, జాతీయ జెండా ఎగరేశారు. పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ తుడి దేవేందర్ గారు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ప్రజలకు కూడు, గూడు లేకపోవడం బాధాకరం అన్నారు. మన దేశం దినదినాభివృద్ధి చెందుతున్నా.. అంతే స్థాయిలో పేదరికం పెరిగిపోతుందన్నారు. రైతుల ఆత్మహత్యలు నేటికీ ఆగడం లేదు. రైతును రాజు చేసినపుడే మన దేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందని సూచించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలు అమలు చేయాలని కోరారు. దివంగత మహా నేత YSR గారు 5 ఏండ్లు మాత్రమే ఉన్నా.. అటు వ్యవసాయాన్ని, ఇటు సంక్షేమాన్ని పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. ప్రజలు స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని, తమ హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో TEAM YSSR రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ మల్లాది సందీప్ కుమారు గారు, సికింద్రాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీమతి శిల్పా గాయత్రి గారు, ఖైరతాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ ఎర్రవరపు వెంకట రమణ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.