YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో GHMC మహిళా కోఆర్డినేటర్ కల్పనా గాయత్రి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు::
YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు(శనివారం) బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వైయస్ షర్మిల గారు పిలుపునిచ్చిన ‘సంక్షేమ బతుకమ్మ’ పేరుతో పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు బతుకమ్మలు పేర్చి, ఆడిపాడారు. బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. బతుకమ్మ వైభవం ఉట్టిపడేలా ఉత్సవాలు జరిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగ.. ప్రజలందరికీ సుఖ, శాంతులు కలిగించాలని కోరుకున్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి, ఆనందమే యజ్ఞముగా YSR తెలంగాణ పార్టీ సాగిపోతుందని తెలిపారు. వైయస్ షర్మిల గారి నాయకత్వంలో తెలంగాణలో వైయస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గడిపల్లి కవిత గారు, జీహెచ్ ఎంసీ మహిళా కోఆర్డినేటర్ కల్పనా గాయత్రి గారు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కోఆర్డినేటర్ ఇ.సుగుణారెడ్డి గారు, సికింద్రాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ కె.సాయి శిల్పాచారి గారు, కూకట్ పల్లి నియోజకవర్గ మహిళా కోఆర్డినేటర్ బి. శివ పావని గారు తదితరులున్నారు.