ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా 181వ రోజు YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు
బోధన్ నియోజకవర్గంలోని బోధన్ టౌన్ అంబేడ్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.
- YSR గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో బోధన్ నియోజకవర్గానికి ఎంతో చేశారు
- నిజాంసాగర్ ప్రాజెక్టుకి 450 కోట్లతో మరమ్మతులు చేయించి 3 లక్షల ఎకరాలకు నీళ్లు అందించారు
- ఈ బోధన్ నియోజకవర్గానికి అలీసాగర్ ప్రాజెక్టుతో 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు
- సాలూరు ప్రాంతంలో మినీ ఎత్తి పోతల పథకం ఏర్పాటు చేయించారు
- ఈ బోధన్ లో విద్యాసంస్థలు ఏర్పాటు చేయించారు
- YSR గారు బ్రతికి ఉంటే ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడో తెరుచుకొనేది
- చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తే.. ప్రభుత్వ పరం చేసేందుకు వైయస్ఆర్ 9 మందితో కమిటీ వేశారు
- వైయస్ఆర్ వెళ్లిపోయాక మళ్ళీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ వైపు ఎవరూ చూడలేదు
- కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో తెరిపిస్తా అని చెప్పారు. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఫ్యాక్టరీ తెరిపించాలి కదా..!
- 2 వేల మంది కుటుంబాలను రోడ్డున పడేశారు
- మంత్రి హరీష్ రావు 2007లో లక్ష మందితో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు హరీష్ రావు మంత్రిగా ఉన్నారు కదా... తెరిపించవచ్చు కదా..!
- చెరుకు పంటను ఆగం చేశారు.మొత్తానికి పంట పండకుండా బంద్ పెట్టించారు. ఇప్పుడు మీరు నడుపుకోండి అంటున్నారు
- ప్రభుత్వ పరంగా నడపలేని ఫ్యాక్టరీ.. ప్రజలు నడుపుకుంటారా? మీకు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా..?
- వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని YSRTP డిమాండ్ చేస్తుంది
- కాళేశ్వరం నుంచి మంజీరకి నీళ్లు తెస్తా అన్నారు.. తెచ్చారా..?
- లక్ష ఎకరాలకు అదనంగా నీళ్లు ఇస్తామన్నారు ఇచ్చారా..?
- చేతకాని ముఖ్యమంత్రి చేసింది గుండు సున్నా
- వైయస్ఆర్ గారు ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు
- 12 శాతానికి పెంచుతామంటూ కేసీఆర్ చెప్పారు కదా.. ఎందుకు పెంచలేదు?
- స్థానిక ఎమ్మెల్యే షకీల్ అంట..షకీల్ ఈ నియోజకవర్గ ప్రజల చేతికి చిప్ప ఇచ్చాడు
- బోధన్ లో ఎమ్మెల్యే కనపడుటలేదట..
- ఈయన ఉండేది హైదరాబాద్ లో.ఈయన కొడుకు హైదరాబాద్ లో ఒక చిన్న బిడ్డను యాక్సిడెంట్ చేసి చంపేస్తే చర్యలు లేవు
- ఈయన ఒక మైనార్టీ ఎమ్మెల్యే..ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం ఏనాడైనా కొట్లడాడా?
- కమీషన్లు ఇస్తే ఏ పనైనా చేస్తాడట
- ఇసుక మాఫియా యథేచ్చగా చేస్తున్నాడు
- పేదవారికి చిప్ప ఇచ్చి..తాను మాత్రం బాగా సంపాదించాడు
- ఈ ఎమ్మెల్యే క్రికెట్ బెట్టింగ్ కింగ్ అంట కదా
- ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు..?
- నియోజకవర్గంలో ప్రజలు తిప్పలు పడుతుంటే.. ఈ ఎమ్మెల్యే మునుగోడులో తిష్ట వేశాడు
- కేసీఆర్ బిడ్డ కోసం ఢిల్లీలో తిప్పలు పడుతున్నాడు
- మంత్రులు,ఎమ్మెల్యేలు అంతా మునుగోడులో పాట్లు పడుతున్నారు
- ఎన్నికలు వస్తేనే దొర కొత్త కొత్త హామీలు ఇస్తున్నాడు
- ఇప్పుడు మునుగోడును కేటీఆర్ దత్తత తీసుకుంటడట. ఇప్పుడు అక్కడ ఎన్నికలు కాబట్టి ఇదొక కొత్త మాట
- గతంలో కొడంగల్ దత్తత అన్నారు.. ఏమయ్యింది?
- కొడంగల్ లో ఏమైనా అభివృద్ధి జరిగిందా..?
- ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కి కొత్త కొత్త పథకాలు గుర్తుకు వస్తాయి
- హుజూరాబాద్ కోసం దళిత బంధు అని పెట్టారు. మునుగోడు ఎన్నికలకు గిరిజన బంధు గుర్తుకు వస్తోంది.
- కేసీఆర్ బై ఎలక్షన్ ముఖ్యమంత్రి. బై ఎలక్షన్ వస్తేనే కేసీఆర్ కు పాలన చేయాలని అనిపిస్తుంది. ఓట్లతోనే కేసీఆర్ కి పని
- వైయస్ఆర్ ప్రజల కోసమే పథకాలు అమలు చేశారు
- 8 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పాడు. కేసీఆర్ చెప్పిన ప్రతి పథకం మోసమే కదా
- బంగారు తెలంగాణ అని చెప్పి బ్రతుకే లేని తెలంగాణగా చేశారు
- ఇది నియంత పాలన.. ప్రజలు బానిసలు అన్నట్టు పరిపాలిస్తున్నారు
- స్థానిక ఎంపీ అరవింద్ ఏమైనా చేశాడా..?
- పసుపు బోర్డ్ తీసుకు వస్తా అని బాండ్ పేపర్ రాసి ఇచ్చాడు కాదా? వచ్చిందా పసుపు బోర్డ్?
- ప్రజలను మోసం చేయడమే నాయకుల పని అన్నట్లు ఉంది
- అందుకే YSR తెలంగాణ పార్టీ పెట్టాం
- YSR ప్రతి సంక్షేమ పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తా
- ఇంట్లో ఎంత మంది అర్హులు ఉంటే అంత మందికి 3 వేలు తక్కువ కాకుండా పెన్షన్ అందజేస్తాం
- నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొదటి సంతకం పెడతాం.