ఆమరణ నిరాహార దీక్షా శిబిరంలో మీడియాతో మాట్లాడిన వైయస్ షర్మిల గారు::
- మరోసారి నియంత అని కేసీఆర్ నిరూపించుకున్నాడు
- గౌరవ హైకోర్టు పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చినా కేసీఆర్ అనుమతి ఇవ్వడం లేదు
- పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నాడు
- న్యాయస్థానం అంటే కేసీఆర్ కు గౌరవం లేదు
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే సాహసం చేస్తున్నాడు
- కేసీఆర్ పతనానికి ఇది నాంధి
- పోలీసులను అడుగడుగునా వాడుకుంటూ మమ్మల్ని అడ్డుకుంటున్నారు
- నర్సంపేటలో మా బస్సును, వాహనాలను, వైయస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేశారు
- పెట్రోల్ తో, కర్రలతో దాడులు చేశారు. లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన పోలీసులు వాళ్లను వదిలి మమ్మల్ని అరెస్ట్ చేశారు
- లా అండ్ ఆర్డర్ సమస్య స్రుష్టించింది టీఆర్ఎస్ అయితే మాపై నెపం మోపి అరెస్ట్ చేశారు
- మళ్లీ అదే పోలీసులను అడ్డం పెట్టుకుని మేం కారులో ఉండగానే లాక్కెళ్లారు
- బెయిల్ మంజూరు చేయకుండా రిమాండ్ కు తరలించాలని కుట్ర చేశారు
- ట్రాఫిక్ సమస్యను అడ్డంపెట్టుకుని రిమాండ్ కు తరలించాలని చూడడం సిగ్గు చేటు
- అయినా గౌరవ న్యాయస్థానం మాకు బెయిల్ ఇచ్చింది
- కేసీఆర్ నియంత పోకడలను నిరసిస్తూ నిన్న డా. బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం
- అక్కడ కూడా పోలీసులను పని వాళ్లలా వాడుకొని మమ్మల్ని అరెస్ట్ చేశారు
- నన్ను ఒక్కదాన్ని మాత్రమే ఇంటి వద్ద వదిలిపెట్టి, మా పార్టీ శ్రేణులను అరెస్ట్ చేశారు
- ప్రశ్నించే గొంతుకలకు కేసీఆర్ సంకెళ్లు వేస్తున్నాడు
- కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడిన వాళ్లపై కేసులు పెట్టి, న్యాయస్థానం చుట్టూ తిప్పాలనేదే కేసీఆర్ టార్గెట్
- మా వాళ్లను అకారణంగా అరెస్ట్ చేశారు. ఎలాంటి కారణం లేకుండా కేసులు పెట్టారు
- నిన్న అరెస్ట్ చేసి ఇప్పటివరకు కూడా విడుదల చేయలేదు. పాత కేసులు తవ్వి, రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు
- కేసీఆర్ పోలీసులను అతి నీచంగా పని వాళ్లలా వాడుకుంటున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల్లా వాడుకుంటున్నారు.
- పార్టీ రాష్ట్ర కార్యాలయం చుట్టూ బారీకేడ్లు పెట్టారు. సామాన్యులను కూడా రానివ్వడం లేదు. వచ్చిన వాళ్లందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు.
- ఎందుకు ఇంత కక్ష? పోలీసులకు మానవత్వం లేదా? పోలీసుశాఖకు అప్రతిష్ట పాలు చేస్తున్నారు.
- ఆర్ఎస్ఎస్ కు బీజేపీ లాగే.. ఈ రాష్ట్ర పోలీసులు కేసీఆర్ కు పనిచేస్తున్నారు. సొంత సైనికుల్లా పోలీసులు తయారయ్యారు.
- పాదయాత్రలో ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను బయటపెడితే మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు
- కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తే మాపై కుట్ర చేశారు.
- ప్రజల కోసం పోరాటం చేస్తుంటే కనికరం లేదు. మానవత్వం లేదు. ఇది మనుషులు చేసే పనేనా?
- బీఆర్ఎస్ పార్టీ అని వాళ్లు సంబరాలు చేసుకోవచ్చు. మేం మాత్రం కనీసం నిరాహార దీక్షలు కూడా చేసుకోనివ్వరా?
- రాష్ట్రాన్ని అప్పులపాలు జేసి, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతాడట కేసీఆర్. సిగ్గుండాలె కదా?
- బంగారు తెలంగాణ పేరుతో దోచుకుని, తెలంగాణ ఖజానాను లూటీ చేశారు
- కేసీఆర్ తెలంగాణ పదం కూడా అవసరం లేదని, తెలంగాణను దోచుకోవడం ముగిసిందని దేశంపై పడ్డాడు
- కేసీఆర్ మాత్రం దేశమంతా రాజకీయాలు చేసుకోవచ్చు. ఆయనకు మాత్రం అన్ని పర్మిషన్లు వస్తాయి.
- ప్రజల కోసం కొట్లాడే మా పార్టీపై మాత్రం దాడులా? ప్రజాస్వామ్యమనే గౌరవం కూడా కేసీఆర్ కు లేదు.
- పాదయాత్రలో మేం ఎక్కడా వ్యక్తిగత దూషణలు చేయలేదు.
- టీఆర్ఎస్ లీడర్లే నాపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు.
- నల్లిని నలిపేసినట్లు నలిపేస్తాం. కాలు బయట అడుగుపెట్టనీయం. బలి ఇస్తాం. ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు అని నాపైనే వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు.
- శిఖండి అని ఒక మహిళా ప్రజాప్రతినిధి తోటి మహిళను పట్టుకుని దూషించింది. నేను గనుక ఆమెను సూర్పనక అంటే ఆమె ముఖం ఎక్కడ పెట్టుకుంటుంది? కానీ అలా అనే సంస్కారం నాది కాదు. అది నీ విచక్షణకే వదిలేస్తున్నా.
- గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ ఏనాడైనా మహిళ కోసం నోరు విప్పిందా? గిరిజన మహిళలను చీరలు పట్టి లాగి కొడుతుంటే ఏనాడైనా అడిగిందా?
- మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ఏనాడైనా ప్రశ్నించిందా? మరియమ్మ అనే దళిత మహిళను లాకప్ లో కొట్టి చంపితే స్పందించిందా? జుట్లు పట్టుకుని పిల్లల తల్లులను కేసీఆర్ జైలులో పెడితే నోరు విప్పిందా?
- నన్ను మాత్రం శిఖండి అంటుందా? కొంచమైనా ఇంగితం ఉందా? పదవి ఉండగానే సరిపోతుందా? పదవికి తగ్గ హుందాతనం ఉండకూడదా? వ్యక్తిగత దూషణలు చేసింది నేనా? మీరా?
- వ్యక్తిగత దూషణలు నాపై చేస్తుంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే.
- 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తే ఒక్కసారైనా నిబంధనలు ఉల్లంఘించామా?
- మా ఫ్లెక్సీలు చింపినట్లు, వాళ్ల ఫ్లెక్సీలు మేం చింపామా? మాపై దాడి చేసినందుకు వాళ్లపై మేం దాడి చేశామా?
- ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్, ఆయన పార్టీ నాయకులు ఖూనీ చేస్తున్నారు.
- టీఆర్ఎస్ ఒకప్పుడు ఉద్యమకారుల పార్టీ. ఇప్పుడు ఉద్యమద్రోహుల పార్టీ. తాలిబన్ల పార్టీ. గూండాల పార్టీ. అవినీతిపరుల పార్టీ.
- ప్రజలకు కష్టమొస్తే ఒక్కసారైనా కేసీఆర్ ఆదుకున్నాడా? ఈయనట దేశాన్ని ఏలబోతాడట.
- కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మా పార్టీ ఆఫీసు చుట్టూ కర్ఫ్యూ ఎత్తేయండి.
- YSR తెలంగాణ పార్టీ నాయకుల్ని విడుదల చేయండి. పాదయాత్రకు అనుమతి ఇవ్వండి.
- లేదంటే ఆమరణ నిరాహార దీక్ష ఆగదు. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోదు ఈ షర్మిల.