పాలేరులో పార్టీ ఆఫీసు నిర్మాణానికి భూమి పూజ చేసిన వైయస్ షర్మిల గారు, విజయమ్మ గారు..
ఈ సందర్భంగా విజయమ్మ గారు మాట్లాడారు...
- పాలేరులో YSR తెలంగాణ పార్టీ మరో ముందడుగు వేసింది
- ఈ భూమి పూజ ఉజ్వల భవిష్యత్తుకు నాంది
- వెనుబడిన వర్గాల బాగు కోసం, నిరాదరణకు గురైన వర్గాల బాగు కోసం తొలిమెట్టు ఇది
- వైయస్ఆర్ జీవితం మొత్తం జనంతో ముడిపడి ఉంది. వైయస్ఆర్ కుటుంబం ప్రజల కుటుంబం
- ప్రజల మంచి కోసం, ప్రజల అభ్యున్నతి కోసం వైయస్ఆర్ కుటుంబం ఎల్లప్పుడూ పనిచేస్తుంది
- ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా చిరునవ్వుతో ముందుకెళ్లే కుటుంబం
- మాట తప్పని మడమ తిప్పని కుటుంబం వైయస్ఆర్ కుటుంబం..
- ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లే కుటుంబం వైయస్ఆర్ కుటుంబం..
- షర్మిలమ్మ పార్టీ పెట్టి 16 నెలలే అయినా అనేక పోరాటాలు చేసింది
- అధికార పక్షం ఎన్ని నిర్బంధాలు సృష్టించినా ప్రజల కోసం ముందుకెళ్లింది
- ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే లాఠీ చార్జ్ చేశారు
- రైతులను కాపాడు దొరా అని అంటే అరెస్ట్ చేశారు
- ప్రజల బాధలను తీర్చండని అడిగితే కొట్టి, తిట్టి, ఈడ్డుకెళ్లారు
- ఆడ వాళ్లు అని కూడా చూడకుండా అవమానించారు
- షర్మిలమ్మ అంటే ఎందుకు అంత కక్ష? ఎందుకు అంత ధ్వేషం? ప్రజల కోసం పోరాడుతుందనా?
- మీరు ఎన్ని నిర్బంధాలు సృష్టించినా, అరెస్టులు చేసినా ప్రజల నుంచి షర్మిలమ్మను ఎవరూ వేరు చేయలేరు
- ఉదయించే సూర్యున్ని ఎవరూ ఆపలేరు
- ప్రజలకు మంచి చేయాలని, వారి జీవితాలు బాగు చేయాలని గొప్ప సంకల్పంతో షర్మిలమ్మ ముందుకెళ్తోంది
- పాలేరులో భూమి పూజ పార్టీ భవిష్యత్తుకు, ప్రజల భవిష్యత్తును ఒక పునాది రాయి
- ఈ పార్టీ కార్యాలయం పేద, బడుగు, బలహీన వర్గాలకు ద్వారంలాంటిది
- షర్మిలమ్మ ఇల్లు ఎక్కడ అంటే పాలేరులోనే..
- పాలేరే తెలంగాణను పాలించే ఊరు
- ఖమ్మం జిల్లా అంటే కొత్త ప్రభుత్వానికి గుమ్మంలాంటిది
- అభివృద్ధికి, సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్
- పాలేరులో పార్టీ కార్యాలయ శంకుస్థాపనతో వైయస్ఆర్ ఆశయాలకు షర్మిలమ్మ పునాది వేశారు
- వైయస్ఆర్ గారిని ఆశీర్వదించినట్టుగానే షర్మిలమ్మను ఆశీర్వదించాలని కోరుతున్నా..
- షర్మిలమ్మ పోరాట పటిమకు పాదయాత్రే రుజువు
- తెలంగాణ బొబ్బిలి షర్మిలమ్మ
- పాదయాత్రలో బస్సును తగలబెట్టినా, వాహనాలు ధ్వంసం చేసినా మొక్కవోని దీక్షతో షర్మిలమ్మ ముందుకెళ్లారు
- అరెస్టులు చేసినా, నిర్బంధాలు సృష్టించినా, పోలీస్ స్టేషన్ లో గంటలు గంటలు నిర్బంధించినా సహనంతో భరించారు
- ప్రజలకు సేవ చేయాలనుకోవడం.. ప్రజా సమస్యలపై పోరాడడం షర్మిలమ్మ చేసిన తప్పా?
- వైయస్ఆర్ రక్తం దేనికీ భయపడదు. షర్మిలమ్మ నమ్మిన సంక్షేమం, సమన్యాయం, స్వయం సమృద్ధి ప్రజలకు అందిస్తుంది