YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ శ్రీ వాడుక రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కోసం వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు సృష్టించినా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే ధ్యేయమన్నారు. వైయస్ షర్మిల గారి పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.