YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా వారియర్లు, వైయస్ఆర్ అభిమానులు హాజరయ్యారు. నిపుణులు, పార్టీ ముఖ్యులు వివిధ అంశాల మీద అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీసుకెళ్లే మార్గాలను సూచించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు తూడి దేవేందర్ రెడ్డి గారు, పిట్ట రాంరెడ్డి గారు, గట్టు రాంచందర్ రావు గారు, సత్యవతి గారు, పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు నీలం రమేష్ గారు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గడిపల్లి కవిత గారు, GHMC కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ గారు, స్టేట్ ఐటీ వింగ్ కన్వీనర్ ఇరుమళ్ల కార్తీక్ గారు తదితరులు హాజరయ్యారు.