వైయస్ఆర్ ఆశయ సాధనకు ఆవిర్భించిన YSR తెలంగాణ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, వైయస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. ఉప్పల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ మల్లెపోగు విజయరాజు ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో చేరికలు జరిగాయి. ముఖ్య అతిథులుగా జీహెచ్ ఎంసీ కోఆర్డినేటర్ శ్రీ వాడుక రాజగోపాల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు శ్రీ దేశిరెడ్డి సురేశ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ భూమి రెడ్డి హాజరై.. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శ్రీ వాడుక రాజగోపాల్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లు దాటినా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఆశయాలను సీఎం కేసీఆర్ నెరవేర్చకుండానే తెలంగాణను వదిలి దేశాన్ని దోచుకోవడానికి వెళ్లాడని విమర్శించారు. కేసీఆర్ పాలనలో దొరలు బాగుపడ్డారు కానీ సామాన్యులకు న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ప్రజల బాగు కోసం, వైయస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడానికే వైయస్ షర్మిల గారు పార్టీ పెట్టారన్నారు. గొప్ప ఆశయాలతో పార్టీ స్థాపించిన వైయస్ షర్మిల గారికి మనమంతా మద్దతు తెలిపి, ఆశీర్వదించాలని కోరారు. పార్టీలో కష్టపడ్డ వారికి పార్టీలో తప్పక గుర్తింపు ఉంటుందన్నారు.
శ్రీ దేశిరెడ్డి సురేశ్ రెడ్డి గారు మాట్లాడుతూ... YSR తెలంగాణ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడి పనిచేయాలన్నారు. కష్టపడ్డ వారికి పార్టీ అధిష్టానం తప్పక గుర్తింపునిస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేయాలన్నారు.
శ్రీ భూమిరెడ్డి గారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సింహభాగం యువత, కార్మికులు, కళాకారులు, విద్యార్థులు పోరాటం చేశారని... కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దొరల పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకులే లేరని, అందుకే వైయస్ షర్మిల గారు పార్టీ స్థాపించి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకయ్యారన్నారు. నేడు రాష్ట్రంలోనే ప్రధాన ప్రతిపక్షంగా YSR తెలంగాణ పార్టీ మారిందన్నారు.
*చెంగిచెర్లలో పార్టీ జెండా ఆవిష్కరణ...*
ఉప్పల్ నియోజకవర్గంలోని చెంగిచెర్ల క్రాస్ రోడ్డు వద్ద జీహెచ్ ఎంసీ కోఆర్డినేటర్ శ్రీ వాడుక రాజగోపాల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు శ్రీ దేశిరెడ్డి సురేశ్ రెడ్డి గారు YSR తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటికీ YSR తెలంగాణ పార్టీ కర పత్రాలను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మేడ్చల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ ఏనుగుల భాస్కర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధికార ప్రతినిధి శ్రీ నానాపురం జయరాజ్, కుత్భుల్లాపూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ సాతాల గోపాల్, ఖైరతాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ ఎర్రవరపు రమణ, కూకట్ పల్లి నియోజకవర్గ మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి బి.శివ పావని, మేడ్చల్ నియోజకవర్గ నాయకులు శ్రీ జి.సాయి రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ నాయకులు శ్రీ పి. యాదగిరి రెడ్డి, మహబూబాబాద్ జిల్లా యూత్ అధ్యక్షులు శ్రీ జి.రాము నాయక్, కీసర మండల అధ్యక్షులు శ్రీ ఉద్దెమర్రి సోమన్న తదితరులు పాల్గొన్నారు.