YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహిళల అభ్యున్నతి కోసం, వారి చదువుల కోసం ఆమె చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గట్టు రాంచందర్ రావు గారు, జీహెచ్ఎంసీ కో ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ గారు, పఠాన్ చెరు అసెంబ్లీ కో ఆర్డినేటర్ ఆర్.చంద్రశేఖర్ గారు, ఖైరతాబాద్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ యర్రవరపు రమణ గారు తదితరులు పాల్గొన్నారు.