YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గట్టు రాంచందర్ రావు గారు మాట్లాడారు.
- తెలంగాణ ప్రయోజనాల కోసం పెట్టిన పార్టీ ఈరోజు తెలంగాణను వదిలేసింది. ఇది తెలంగాణకు ద్రోహం చేసినట్లు కాదా?
- ఖమ్మంలో సభ పెట్టి BRS సమావేశం బాగా జరిగిందని డబ్బా కొట్టుకుంటున్నారు. కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో సభ పెట్టి BRS సభ సక్సెస్ అనాలి
- సభకు వచ్చిన ఒక ముఖ్యమంత్రి ఇది కంటి వెలుగు సభ అన్నారు
- దేశ వ్యాప్తంగా దళిత బంధు పథకం తెస్తారట.. కంటి వెలుగు అమలు చేస్తారట
- రాష్ట్రంలో పథకాలు అమలు చేయలేని ఈ ముఖ్యమంత్రి దేశ వ్యాప్తంగా అమలు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉంది
- ప్రజలకు పథకాల పేరుతో తాయిలాలు ప్రకటించడం.. మోసం చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య
- రైతు బంధు 20 లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు అందలేదు
- రాష్ట్రంలో ఒక్క రైతు బంధు పథకం పెట్టి సబ్సిడీ పథకాలు అన్నీ బంద్ పెట్టారు
- ఇక దేశ వ్యాప్తంగా సబ్సిడీ పథకాలు బంద్ పెట్టడం మీ లక్ష్యమా..?
- నిన్న మొన్నటి వరకు మీతో తిరిగిన కర్ణాటక కుమారస్వామి ఈ సభకు ఎందుకు రాలేదు..?
- BRS లో ఒక అంతర్మథనం మొదలయ్యింది. ఇది తెలంగాణ వాదులకు, BRS వాదులకు మధ్య వివాదంలా నడుస్తోంది
- ఉద్యమకారులు BRSలో ఇమడలేకపోతున్నారు
- కేసీఆర్ TRS నేతగా అమరుల కుటుంబాలకు మొండి చెయ్యి చూపించారు
- అసలైన ఉద్యమ కారులకు ఏళ్ల తరబడి అన్యాయమే జరుగుతుంది
- ఉద్యమంలో పెద్ద పెద్ద నాయకులను పక్కన పెట్టారు
- కేసీఆర్ ఎటు పోతే ఉద్యమ కారులు అటువైపే వస్తారనుకోవడం మూర్ఖత్వం
- ఉద్యమంలో కేసీఆర్ ఒక వ్యక్తి మాత్రమే. ఉద్యమం కేసీఆర్ వెనుక లేదు
- BRS లో తెలంగాణ అనే పదాన్ని కేసీఆర్ ఇప్పుడు పలకనివ్వడం లేదు
- తెలంగాణ అనే పదం పలకొద్ధని కేసీఆర్ చెప్తున్నాడు
- కేవలం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ నుంచి పోతున్నాడని ఖమ్మంలో సభ పెట్టాడు
- BRS చర్యలన్నీ బీజేపీకి ఉపయోగపడేవే
- కేసీఆర్ తెలంగాణను వదిలి పోతాడు.. వైయస్ షర్మిల గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారు
- తెలంగాణలో జై తెలంగాణ అని పలికే హక్కు ఉన్న ఏకైక పార్టీ YSRTP
- తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుంది
- వరంగల్ లో ఈ నెల 25న విసృత స్థాయి సమావేశం, ఈ నెల 29న జీహెచ్ఎంసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నాం.
- సమావేశంలో పార్టీ రాజకీయ కార్యాచరణ కమిటీ సభ్యులు పిట్ట రాం రెడ్డి గారు, నీలం రమేష్ గారు, గడిపెల్లి కవిత గారు, ఏపూరి సోమన్న గారు తదితరులు పాల్గొన్నారు.