ఈరోజు YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గారు పార్టీ ముఖ్య నేతలను కలవడం జరిగింది. రాష్ట్రంలో అనాథ పిల్లలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి , వారు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వ పరంగా పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న అనాథ హక్కుల సాధన కోసం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి పార్టీ మద్దతు ఇవ్వాలని కోరారు. ఏడేళ్లు దాటినా కేసీఆర్ అనాథ పిల్లలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యారని, రాష్ట్రంలోని రాజకీయ పక్షాలతో పాటు, స్వచ్ఛంద సంస్థలు, కుల,ప్రజా,మహిళా సంఘాలను ఆహ్వానిస్తున్నామని, ప్రతి ఒక్కరు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు తెలిపి కేసీఆర్ నిర్లక్ష్యంపై ప్రశ్నించాలని కోరారు.