బతుకులేని కౌలు రైతు
పంట దిగుబడి లేక...కౌలు పైసలు ఇవ్వలేక ఇబ్బందులు
పెరుగుతున్న కౌలు రైతుల ఆత్మహత్యలు
ఈ రోజుల్లో దుక్కి దున్ని భూమిని చదును చేసి పంట పండించడం అంత సులువు కాదు. అలాంటిది భూమిని కౌలుకు తీసుకుని దానిపై పెట్టుబడి పెట్టి పంట చేతికందకపోతే వారి బాధ వర్ణనాతీతం. ఇదే తరహాలో తెలంగాణలోని కౌలు రైతుల పరిస్థితి దీనంగా మారింది. ఎటు చూసినా ఎడారి బతుకులు ఎండిపోతున్న ఆశలు అవడంతో చేసేదేమీ లేక వారు ఆత్మహత్యల వైపు మొగ్గుచూపుతున్నారు. రోజురోజుకి తెచ్చిన అప్పులు పెరిగి వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇటీవల నల్గొండ జిల్లా, తొడల్ వాయికి చెందిన బండారు స్వామి కౌలు కట్టలేక పంట చేదికందకపోవడంతో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఆత్యహత్య చేసుకున్న రైతుల సంఖ్య వేలల్లో ఉంది. ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం వైయస్ఆర్ గారు ఇచ్చిన సబ్సిడీ పథకాలను అన్నీ బంద్ పెట్టి రైతు బంధు పేరుతో వందల ఎకరాలు ఉన్న ధనికులకు రాష్ట్ర ఖజానాను దోచిపెడుతోంది. 100 ఎకరాలు ఉన్న వారికి ఈ రోజుల్లో పంట పండించనవసరం లేదు. 100 ఎకరాల భూస్వామికి సంవతత్సరానికి 10,00,000 రూపాయల రైతుబంధు వస్తుంటే ఆయన ఇంకేం పంట పండిస్తాడు. హాయిగా దర్జాగా కూర్చుని తింటాడు. అదే 1 ఎకరం భూమి ఉన్న రైతుకు 10,000 రూపాయలు మాత్రమే వస్తోంది. దీనితో కనీసం ఒక పంటకు సరిపడా ఎరువులు కూడా రావడం లేదు. అదే కౌలు రైతు పరిస్థితి మరీ ఘోరం. ఇటు రైతుబంధు లేదు...అటు పంట చేతికందనూ రాదు. వందల ఎకరాలు ఉన్న భూస్వాములు హాయిగా రైతుబంధు తీసుకుని భూమిని కౌలుకు ఇచ్చి మరింత సొమ్మును జమచేస్తూ పేదలను పీక్కుతింటున్నారు. ఇందుకేనా బంగారు తెలంగాణ అయ్యింది. ఇదేనా కోరుకున్న బంగారు తెలంగాణ. పేదల బతుకులు మార్చేందుకు వచ్చిన తెలంగాణ ధనికులకు అడ్డాగా మారింది. పేదలు మరింత దారిద్య్రానికి దిగువకు వెళ్లిపోతున్నారు. రానున్న రోజుల్లో పేద వారు బతకడమే తెలంగాణలో కష్టంగా మారుతుందనడంలో సందేహం లేదు. అందుకే YSR తెలంగాణ పార్టీ కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తోంది. YSR తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు రైతులను, రైతు కూలీలను ఆదుకుంటుందని వైయస్ షర్మిల గారు హామీ నిచ్చారు.