కేజీ టూ పీజీ ఉచిత విద్య ఏమాయే..?
ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలల్లో సౌలతుల కరువు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇదే దుస్థితి
ఉచిత విద్య అందించాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్
ఎవనికిందనో పనిచేయాలి తప్ప మనం ఒకరికి జాబ్ ఇవ్వద్దు..మనం ఎందుకు మన దుకాణం పెట్టోద్దు. మనమేందుకు వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ పెట్టొద్దు. గూగులు, ఫేస్ బుక్, ట్విట్టర్ ఏమైనా బ్రహ్మపదార్థాలా...రాకెట్ సైన్సా మనం కనిపెట్టలేమా..? ఇవన్నీ ఎవరు చెప్పినవో కాదండి స్వయానా తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ మాట్లాడిన మాటలు. అవును మీరు చెప్పేది బాగానే ఉంది..పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్ కి పోవాలని అందరూ అనుకుంటారు. అయితే ఇక్కడే ఉంది ఓ కిటుకు. ప్రభుత్వ స్కూల్ కి పోతే సరైన విద్య అందదూ. ప్రయివేటు స్కూల్ కు పోతే ఫీజుల దోపిడికి గురవుతున్నారు. ఎల్ కేజీ నుంచి పీజీ పూర్తయ్యే సరికి విద్యార్థిపై ఒక్కో తండ్రి పెడుతున్న ఖర్చు 20లక్షల పైనే...అవే డబ్బు ఉచిత విద్య అంది ఉంటే ఆ డబ్బుతో ఆ విద్యార్థి బాగుపడలేడా...ఒక సారి ఆలోచన చేయాలి కేటీఆర్ సారూ..చెప్పడం సులువే కానీ అనుభవించే వాడికే తెలుస్తుంది బాధ. పెద్ద స్కూల్ లో చదివి, ఫారన్ రిటన్ అయిన మీరు మీ తండ్రి తెలంగాణ ప్రజల డబ్బుతో ఇలా మాట్లాడారు. కానీ పేద ప్రజల బిడ్డలు చదువులకు పెట్టే డబ్బుతో వారి భవిష్యత్తులు మారవచ్చు. తెలంగాణ వస్తే కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నారు. ప్రయివేటు విద్యా సంస్థలు మూసుకోవాల్సిందే అని చెప్పారు మన కేసీఆర్ సారు. కానీ అదే ప్రయివేటు విద్యా సంస్థలకు ప్రజల సొమ్ము దోచి పెడుతున్నారు. ప్రయివేటు విద్యాసంస్థల ఒత్తిడి తట్టుకోలేక పలుచోట్ల విద్యార్థులు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలల్లో వసతులు సరిగా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్, సరూర్ నగర్ లోని ప్రభుత్వ కళాశాలలో 700 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉందంటేనే అర్థమవుతోంది రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల పరిస్థితి ఎలా ఉందో. రాష్ట్ర వ్యాప్తంగా బడులు, కళాశాలల్లో ఉచిత విద్య అమలు చేయాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.