మహిళా దినోత్సవం రోజు మహిళలకు ప్రశ్నించే హక్కు లేదా..?
కేటీఆర్ నియోజకవర్గంలోనే మైనర్ లపై అత్యాచారం జరిగితే దిక్కులేదు
అధికార పార్టీ నేతలే అత్యాచారాలకు పాల్పడుతున్నారు
రాష్ట్రంలో గడిచిన 5ఏండ్లలో వేల సంఖ్యలో అత్యాచారం కేసులు నమోదు
కేసీఆర్ బిడ్డకు తప్పితే రాష్ట్రంలో ఏ మహిళకు గౌరవం లేదు
YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ఫిల్మ్ నగర్ లో ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల విషయంలో నెంబర్ 1. మహిళలను ఎత్తుకు పోవడంలో రాష్ట్రం నెంబర్ 1. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. మహిళలకు భద్రత కల్పిస్తున్నాం అని కేసీఆర్ సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. రాష్ట్రంలో యేటా 20 వేల అత్యాచారాలు జరుగుతున్నాయి. కేసీఆర్ కి మహిళల పట్ల చిత్త శుద్ది లేదు. మహిళలు కేసీఆర్ కి ఓట్లు వేసే యంత్రాలుగా కనిపిస్తున్నారు. మహిళల భద్రతకు చిన్న దొర కేటీఆర్ భరోసా యాప్ అని చెప్పాడు. ఎక్కడుంది భరోసా యాప్. నేను ఫోన్ లో చెక్ చేశా...ఎక్కడ కనపడలేదు యాప్. కేవలం మాటలకి మాత్రమే చిన్న దొర, పెద్ద దొర. తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్ మైన్ లా తయారయ్యింది. మహిళల పట్ల ఎక్కడ ఏ బాంబ్ పేలుతుందో తెలియదు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో వేల కేసులు నమోదు అయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో మంది మహిళలపై అత్యాచారాలు చేశారు. చిన్న దొర కేటీఆర్ నియోజక వర్గంలో కూడా మైనర్ లపై అత్యాచారం జరిగితే దిక్కు లేదు. హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు అత్యాచారం జరిగితే దిక్కు లేదు. ఆడపిల్లలపై కన్నెత్తి చూస్తే గుడ్లు పీకుత అని చెప్పిన కేసీఆర్ ఎంత మంది గుడ్లు పీకారు. స్వయంగా మంత్రుల బందువులు రేప్ లు చేసినా దిక్కు లేదు. కేసీఆర్ కి ఆడవాళ్ళు అంటే వివక్ష. కేసీఆర్ కి ఆడవాళ్ళు అంటే కక్ష్య. దళిత మహిళలలు అని చూడకుండా దాడులు చేస్తున్నారు. దళిత మహిళలను లాకప్ డెత్ లు చేస్తున్నారు. తెలంగాణలో ఒకే ఒక్క మహిళ కవితకు మాత్రమే రక్షణ ఉంది. మిగతా మహిళలు అంటే కేసీఆర్ కి లెక్కే లేదు. ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ మీదనే అసభ్య పదజాలం. స్వయంగా గవర్నర్ కే గౌరవం లేదు. రాష్ట్రంలో మహిళా కమీషన్ ఒక డమ్మీ. నేనే స్వయంగా మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసినా దిక్కు లేదు. నేను ఒక మహిళ అయి ఉండి..సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడితే నోటి కొచ్చినట్లు తిట్టారు. స్వయంగా కేటీఆర్ వ్రతాలు అన్నాడు. ఒకడు మరదలు అన్నాడు..ఒకడు ఫ్యాషన్ షో అన్నాడు. ఒకరేమో కొజ్జా అని తిట్టాడు. మా బస్సులు తగల బెట్టారు. ఇదేనా రాష్ట్రంలో మహిళకు ఉన్న గౌరవం. రాష్ట్రంలో ఐఏఎస్ మహిళ అధికారులకు గౌరవం లేదు. మహిళా ఉపాధ్యాయులకు గౌరవం లేదు. పోడు భూములకు పట్టాలు అడిగితే చంటి బిడ్డల తల్లులను జైల్లో పెట్టారు. ఇది దిక్కుమాలిన పాలన. కేసీఆర్ బిడ్డ తప్పితే ఎవరు సంతోషంగా లేరు. కేసీఆర్ బిడ్డ కవితకు ఏ లోటూ లేదు. ఓడిపోతే కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాడు. కవిత లిక్కర్ స్కాంలో చిక్కి మహిళల గౌరవాన్ని దెబ్బ తీసింది. రాష్ట్రంలో దిక్కు లేదు కానీ కవిత దేశంలో ధర్నా అంటుంది. అసలు రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్ 33 శాతం ఎక్కడ అమలు అవుతుంది. ఇక్కడ నాలుగు శాతం కూడా అమలు కాలేదు. రెండు పర్యాయాలు కలిపి 10 సీట్లు కూడా మహిళలకు ఇవ్వలేదు. ఇక మహిళా మంత్రులకు దిక్కు లేదు. ఉన్న ఇద్దరు మంత్రులను డమ్మీలు చేశారు. మహిళా దినోత్సవం అని చెప్పి కేసీఆర్ మహిళలను మోసం చేశారు. సున్నా వడ్డీ కింద రాష్ట్రంలో 4500 కోట్ల రూపాయల బకాయిలు పడ్డారు. ఇప్పుడు రూ.750 కోట్లు ఇచ్చి మొత్తం ఇచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారు. మిగిలిన 4 వేల కోట్ల రూపాయల పరిస్థితి ఎంటి అని ఎవరు అడగడం లేదు. రాష్ట్రంలో వి హబ్ అని పెట్టారు..ఎక్కడ ప్రాధాన్యత లేదు. అసలు మహిళల అభ్యున్నతికి ఒక్క పథకం లేదు. ఇంట్లో మహిళ వృద్ధురాలికి పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. భర్తకి ఇస్తే భార్యకు ఇవ్వరట. చిన్న పిల్లలు స్కూళ్ళలో బాత్ రూంలకు వెళ్ళడానికి వసతులు ఉండవు. కేసీఆర్ ది నియంత పాలన. కేసీఆర్ నిర్లక్ష్యానికి నిరసనగా నేను ఈరోజు మౌన దీక్ష చేస్తున్నా. సాయంత్రం వరకు ఇక్కడే దీక్ష చేస్తా’’. ట్యాంక్ బండ్ రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జిలతో మౌనదీక్షకు దిగిన వైఎస్ షర్మిల గారు. వైయస్ షర్మిల గారి దీక్షను భగ్నం చేసి అరెస్టు చేసిన పోలీసులు. అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం బొల్లారం నుంచి లోటస్ పాండ్ కు వైయస్ షర్మిల గారిని తరలించారు.