తేది 03-13-2023
హైదరాబాద్
వైయస్ షర్మిల గారు
YSR తెలంగాణ పార్టీ అధినేత్రి
కాళేశ్వరం అవినీతిపై పార్లమెంట్ కు వెళ్తాం
- కేసీఆర్ అవినీతి దేశానికి తెలిసేలా చేస్తాం
- కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతమంటూ తెలంగాణతో పాటు దేశ ప్రజలను మోసం చేశారు.
- కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు, మీడియా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలుసు.
- 70 వేల కోట్ల అవినీతితో 2జీ, కోల్ గేట్ కు తీసిపోని స్కాం కాళేశ్వరం.
- కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత అవినీతి జరిగినా ఇంత వరకు ఏ విచారణ చేపట్టలేదు.
- 14న వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేసుకుంటూ వెళ్లి దేశం మొత్తం, పార్లమెంట్ సభ్యులకు కాళేశ్వరం గురించి తెలిసేలా చేయాలని నిర్ణయించాం
- వైయస్ఆర్ గారు 38 వేల ఐదు వందల కోట్లతో అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల అనే పేరుతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 16 లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని తలిస్తే... కేసీఆర్ గారు అదే ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో లక్షా 20 వేల కోట్ల ఖర్చుతో కేవలం 18 లక్షల 25 వేల 700 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చేలా చేశారు.
- ఇంత ఖర్చు చేసి అసెంబ్లీలో నిలబడి మంత్రి కేవలం లక్షా 50 వేల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చిందని చెబుతున్నారు.
- ఇది అట్టర్ ఫ్లాప్ అయిన ప్రాజెక్ట్
- కమీషన్ల కోసమే చేసిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్
- అవసరం లేని బ్యారేజ్ లు, మెయిన్ కెనాల్స్, అప్రోచ్ కెనాల్స్ , పంప్ హౌస్ లు, సైడ్ కెనాల్స్, బాహుబలి మోటార్లు...
- అవసరం లేని దాని మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టి అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ చేశారు.
- రెండు టీఎంసీల చొప్పన 90 రోజులకు గాను 180 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం నుంచి తీసుకోవచ్చు.
- ఇంత వరకు కనీసం ఏ ఒక్క సంవత్సరం కూడా అర్ధ టీఎంసీ కి మించి నీళ్లు తీసుకోలేదు.
- కేవలం 30 టీఎంసీల నీళ్లు మాత్రమే అందించారు.
- ప్రభుత్వ లెక్కలే ఒక సంవత్సరం 50 వేల ఎకరాలకు, ఒక సంవత్సరం 57 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని అని చెబుతున్నాయి.
- ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేసీఆర్ కాళేశ్వరం నీళ్లతోనే తెలంగాణ సస్యశ్యామలం అవుతోందని గోబెల్స్ ప్రచారం చేయడం సబబేనా?
- ఎస్సారెస్పీ ఫేజ్-1, నిజాం సాగర్ నుంచి వస్తున్న నీళ్లను కాళేశ్వరం ఖాతాలో వేస్తున్నారు.
- రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ఎస్సారెస్పీ ఫేజ్-2, ఎల్లంపల్లి, వరద కాలువ , దేవాదుల , మిడ్ మానేర్ లాంటి ఎన్నో ప్రాజెక్టులు నీళ్లు ఇస్తుంటే అవి కాళేశ్వరం నుంచి వస్తున్నట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు
- వైయస్ఆర్ గారు 38 వేల కోట్లతో అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ చేయాలని సుమారు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి కాలువల పనులు సుమారుగా పూర్తి చేశారు.
- అదే ప్లాన్ తో ప్రాజెక్టును కొనసాగిస్తే తక్కువ ఖర్చుతోనే 16 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి కదా..
- ప్రాజెక్ట్ ఖర్చు మూడింతలు పెంచారు.. మెగా కృష్ణా రెడ్డి అనే కంట్రాక్టర్ తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి కమీషన్ల కోసం రీడిజైనింగ్ చేశారు
- 80 వేల కోట్లకు రీడిజైనింగ్ చేశామన్నారు.. లక్షా 20 వేల కోట్లకు ఎందుకు పెరిగింది?
- కాంట్రాక్టులు ఎలా ఇచ్చారనేది చూస్తే అన్నీ అవకతవకలే కనిపిస్తున్నాయి..
- బెల్ నుంచి 16 వందల కోట్లకు సామాగ్రి కొంటే 7,500 కోట్లు ఖర్చయినట్లు చూపించారు.
- ఏది కొన్నా నాలుగైదింతలు ఎక్కువ ఖర్చు చూపించారు...
- అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు విచారణ చేయడం లేదు..
- కేసీఆర్ ఈ ప్రాజెక్టు నా రక్తం.. నా మెదడు.. నా చెమట అన్నాడు.. ఆయనే ఆర్కిటెక్ట్, ఆయనే డిజైనర్..
- కేసీఆర్ రీడిజైన్ చేసిన ప్రాజెక్ట్ నాణ్యత లేక మూడేళ్లకే మునిగిపోయింది.
- పంప్ హౌజ్ ల ఎత్తు కూడా చూసుకోకుండా కట్టారు. నాసిరకం పనులు చేశారు.
- ఈ పనుల నాణ్యతపై ఆడిట్ జరగాల్సిన అవసరం లేదా?
- ఇస్తామని చెప్పినన్ని నీళ్లు ఇవ్వకపోగా నీళ్లను ఎత్తిపోయడానికి పవర్ బిల్ అదనం.. 3 వేల కోట్లు ఖర్చయింది..
- ఏట్ లోన్లకు వడ్డీలే 13 వేల కోట్లు కడుతున్నారు..
- లక్షా ఇరవై వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరే..
- ఏం ఆలోచన చేసి కాళేశ్వరం మీద ఇంత ఖర్చు పెట్టారు..
- కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు లక్ష కోట్లు కేంద్రం నుంచి తెచ్చుకున్న డబ్బులు..
- దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?
- కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రజలకు , ప్రతిపక్షాలకు , మీడియాకు చూపిస్తున్నారా?
- ఎవరినీ అడుగు పెట్టనివ్వడం లేదు..
- రెండు టీఎంసీలకు అనుమతి ఉన్నా నీళ్లు తీయకుండా మూడో టీఎంసీ కోసం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు
- గ్లోబల్ టెండరింగ్ లేకుండా ప్రగతి భవన్ లో కూర్చొని నచ్చిన వాళ్లకు టెండర్ ఇస్తున్నారు
- మూడో టీఎంసీ అవసరమే లేదు..
- కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్ తో వేల ఎకరాల్లో పంట నష్టం జరుగుంతోంది..
- కేసీఆర్ వాళ్ల గురించి పట్టించుకున్నారా?
- కేసీఆర్ 80 శాతం ప్రాజెక్టుటు ఒకే మనిషికి ఇస్తుంటే కాంగ్రెస్ బీజేపీలు మెగా క్రుష్ణా రెడ్డి, కేసీఆర్ అవినీతిపై ఎప్పుడైనా మాట్లాడినయా?
- ఓటుకు నోటు కేసులో దొంగ రేవంత్ రెడ్డి మెగా కృష్ణా రెడ్డి దగ్గర డబ్బు తీసుకొని నోరు తెరిచి ప్రశ్నించడం లేదు..
- బండి సంజయ్ గారు కూడా డబ్బులు తీసుకున్నారు కాబట్టే మాట్లాడం లేదా?
- అందరూ మాటలు చెబుతున్నారు కానీ విచారణ చేయడం లేదు..
- బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు విచారణ చేయడం లేదు?
- మేం ఏ ఒత్తిళ్లకు లొంగకుండా ధైర్యంగా ప్రశ్నిస్తున్నాం..
- అందరూ ఎంపీలు తెలంగాణకు జరిగిన అన్యాయంపై కలిసి రావాల్సిన అవసరం ఉంది..
- కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై మేం చేస్తున్న పోరాటానికి ఎంపీలంతా సంఘీభావం తెలపాలి.
- ఒక మహిళ బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కాం లో ఇరుక్కుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా మద్దతు ఇస్తున్నారు
- కేసీఆర్ తెలంగాణ ఖజానాను కొల్లగొట్టి ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే ప్రజల తరఫుున నిలబడాల్సిన బాధ్యత లేదా?
- బీఆర్ఎస్ ఎంపీలు కూడా దీనిపై ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది