ఆర్టీసీ ఆస్తులపై కన్నేసిన కేసీఆర్
అప్పుడు అలా..ఇప్పుడు ఇలా..
ఆర్టీసీ విలీనంపై యూటర్న్
ఆర్టీసీకి లక్షకోట్ల ఆస్తులు
రాష్ట్రంలోని పలు పట్టణాల్లో విలువైన భూములు
ఆర్టీసీని గవర్నమెంట్ ల కలపడమేంటి అది ఒక అసంబద్ధమైనటువంటి, అసంబవమైనటువంటి, అర్థరహితమైనటువంటి, ఒక తెలివి తక్కువ నినాదం పట్టుకుని అది ఒక నినాదమా...తలకాయ మాషిపోయినోడు, నెత్తిమాషిపోయినోడు గీవిళ్లా నాకర్థంకాదు అంటూ భారీ డైలాగులు కొట్టిన కేసీఆర్ ఇప్పుడు అదే నోటి నుంచి విలీనం చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ మాటమీద నిలబడే మనిషే కాదు. చెప్పినదేదీ ఇంత వరకు చేయలేదు. చెప్పిన హామీలు నెరవేర్చకుండా రాజకీయాల కోసం మాత్రమే కేసీఆర్ పనిచేస్తారు. ఎప్పుడూ ఎన్నికలు వస్తాయో అప్పుడు మాత్రమే హామీలు గుప్పించి సీఎం సీటులో కూసునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తాడు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు భారీగా నష్టపోయారు.
ఆర్టీసీ విలీనం వెనుక భారీ కుట్ర
52రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వారిని తీసేయండి అంటూ బెదిరించిన కేసీఆర్ సారు ఇప్పుడు ఒక్కసారిగా వారిపై ప్రేమ వొలకబోయడం వెనుక భారీ కుట్రే జరుగుతోంది. ఆర్టీసీ సమ్మె అనంతరమే ఈ కుట్ర మొదలైనట్టు తెలుస్తోంది. ఆర్టీసీని నేనే చూసుకుంటా అంటూ మొదటగా ఆర్టీసీ సంఘాలను నిర్వీర్యం చేశారు. అనంతరం ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన రెండు పీఆర్సీలను ఇవ్వలేదు. ఇక సస్పెండ్ లు ఉండవని సమ్మె తర్వాత హామీ ఇచ్చి ఇప్పటి వరకు 374మందిని సస్పెండ్ చేశారు. దాదాపు 50వేల మంది రిటైర్ అయితే వారి స్థానంలో కొత్త వారిని తీసుకోకుండా ఉన్న 43వేల మందితోనే అదనపు పనిభారం మోపి కార్మికులను ఇబ్బందులకు గురిచేశారు. రిటైర్ అయిన ఉద్యోగులతో పాటు ఉన్న వారితో కలిపి లక్షమంది కుటుంబాల ఓట్ల కోసం ఇప్పుడు విలీనం చేస్తున్నామని ప్రకటించారు. ఆర్టీసీకి పలు పట్టణాల్లో ముఖ్యమైన ప్రాంతాల్లో భూములు ఉన్నాయి. వాటి ఆస్తుల విలువ లక్షల్లో ఉంది. కేసీఆర్ కన్ను ఇప్పుడు ఆర్టీసీ ఆస్తులపై పడింది. అందుకే ఆర్టీసీ సంఘాలు మాట్లాడకుండా నిర్వీర్యం చేసి, కార్మికులు ప్రశ్నించకుండా ప్రభుత్వంలో కలిపేశారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆర్టీసీ భూములపై జీవో విడుదల చేసి చట్టబద్దత కలిపించాలి.