- సమస్యలేంటో చూపిస్తా...
– దళితలపై ప్రేమే ఉంటే ఇతర నియోజకవర్గాల్లో ఎందుకు అమలు చేయరు?
– ఎస్సీ నియోజకవర్గాలు మీ కంటికి కనిపించడం లేదా?
– ఎన్నికల కోడ్ వల్ల ఎలాగైనా ఆగుతదనే హుజూరాబాద్‌లో దళిత బంధు పెట్టిండు..
– రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఒక్కటే.. ఏ పార్టీకి ఓటు వేసినా.. ఒక్కటే
– బీజేపీ మత రాజకీయాలతో పబ్బం గడుపుతోంది
– మూడో రోజూ ప్రజా ప్రస్థానంలో వైయస్ షర్మిల గారి ప్రసంగం::
ప్రజా ప్రస్థానంలో భాగంగా మూడో రోజూ రంగారెడ్డి జిల్లా కాచారం క్రాస్ రోడ్డు నుంచి శంషాబాద్ వరకు సాగింది. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు కాచారం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి నర్కూడ గ్రామానికి మధ్యాహ్నం చేరుకుంది. మధ్యాహ్నం భోజనం అనంతరం ఊట్ పల్లి గ్రామం నుంచి రాళ్లగూడ మీదుగా శంషాబాద్ కు పాదయాత్ర సాగింది. శంషాబాద్ లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మాట్లాడుతూ...
“ కేసీఆర్ కు దమ్ముంటే మాతో పాదయాత్రలో పాల్గొనాలని సవాల్ చేస్తున్నా. సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాస్తానని, సమస్యలు ఉంటే కేసీఆర్ కుటుంబం రాజీనామా చేయాలి. దళితున్ని ముఖ్యమంత్రిని చేయాలి. ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఐటీ రంగం వైయస్ఆర్ తోనే సాధ్యమైంది. శంషాబాద్ లో కనీసం స్ట్రీట్ లైట్లు కూడా లేవు. ఈ పరిస్థితులు మారాలంటే కేసీఆర్ ను గద్దె దించాలి. వైయస్ఆర్ గారు రైతులకు రుణమాఫీ చేశారు. పేద పిల్లలకు ఉచితంగా విద్యనందించాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల గురించి ఆలోచించి, వారికి విద్య, వైద్యం అందించారు. ఈ రోజు 108, 104 వాహనాలు ప్రతి గ్రామానికి వెళ్తున్నాయంటే అది వైయస్ఆర్ గారి వల్లే సాధ్యమైంది. పన్నులు పెంచకుండా వైయస్ఆర్ ప్రభుత్వాన్ని నడిపారు. నక్కలు ఎరగని బొక్కలు లేవు...పాములు ఎరగని పుట్టలు లేవు..కేసీఆర్ మొసం చేయని వర్గం లేదు. అందరినీ మోసం చేస్తూ కేసీఆర్ కాలం గడుపుతున్నారు.
కేసీఆర్ ఒక్కమాట నిలబెట్టుకోలేదు. హూజురాబాద్ ఎన్నికలున్నాయని దళితబందు అమలు చేస్తున్నారు. దళితబందును రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ పథకాలు అమలు చేయడం, ఎన్నికలు అయిపోగానే మాటదాటవేయడం కేసీఆర్ కు వెన్నెతో పెట్టిన విద్య. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నా కేవలం హుజూరాబాద్‌లోనే దళిత బంధు ప్రకటించారు. ఇచ్చిన పది లక్షలు కూడా ఫ్రీజింగ్లో పెట్టారు. ఎన్నికలు అయిపోయాక ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. దళితులపై నిజంగానే ప్రేమే ఉంటే ఇతర నియోజకవర్గాల్లో దళిత బంధలు అమలు చేసి, ఎన్నికలు అయ్యాక హుజూరాబాద్‌లో అమలు చేయాలి. రాష్ట్రంలో భూమల పంచాయితీలు ఎక్కువయ్యాయి. ధరణి పేరుతో మరిన్ని సమస్యలు తీసుకొచ్చారు.
గతంలో కరోనాతో పేదలు చనిపోయినా.. కేసీఆర్ పట్టించుకోలేదు. కరోనా వస్తే పారాసిటమల్ వేసుకొండని, ప్రభుత్వాసుపత్రుల్లో జాయిన్ కండి అని కేసీఆర్ అన్నారు. ఆయనకు కరోనా వస్తే మాత్రం యశోద ఆస్పత్రిలో చేరారు. కరోనా కష్టకాలంలో కేసీఆర్ ఒక్కరినైనా ఆదుకున్నారా?. తండ్రి, కొడుకులు మాటలు మాత్రమే చెబుతారు. రాష్ట్రంలో ఉద్యోగాలు, నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులు డిగ్రీలు, పీజీలు చదివి రోడ్డు మీద పండ్లు, కూరగాయలు అమ్ముతున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఆవేదన చెందుతున్నారు. పిల్లలను చదివించకున్నా బాగుండని ఆవేదన చెందుతున్నారు. చిన్నపిల్లలను రేప్ చేసిన ఘటనలు తెలంగాణలో చోటుచేసుకుంటున్నాయి. ఇదా కేసీఆర్ పాలన? ప్రజలకు హామీలను నెరవేర్చని కేసీఆర్ ఉరివేసుకుని చచ్చిపోవాలి. పేదలకు వచ్చే కరెంటు బిల్లులు చూస్తే కరెంట్ షాక్ కొట్టేలా ఉన్నాయి. ప్రజలకు డబుల్ బెడ్ రూంలు ఇప్పటికీ ఇవ్వలేదు గాని ప్రగతి భవన్లో బాత్ రూంలకు బుల్లెట్ ఫ్రూఫ్‌లు పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం, డ్రగ్స్ ఏరులై పారుతోంది. తెలంగాణలో ఉన్న పరిస్థితులు మారాలంటే సర్కార్ మారాలి. ఉచిత విద్య, వైద్యం రావాలంటే వైయస్ఆర్ పాలన మళ్లీ రావాలి. కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే టీఆర్ఎస్ కు ఓటు వేయడమే. బీజేపీ కులం, మతం పేరుతో ప్రజలను మోసం చేస్తోంది. YSR తెలంగాణ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం.
మీ కోసం నేను నిలబడతాను...మిమ్మల్ని కూడా నిలబెడతాను::
పాదయాత్రలో రైతులు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు తమ సమస్యలను YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలకు తెలిపారు. రైతులు మాట్లాడుతూ...ధరణి వెబ్ సైట్ వల్ల చాలా సమస్యలు ఎదుర్కుంటున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లి సమస్యలు తెలిపితే డబ్బులు అడుగుతున్నారని వినతిపత్రం అందజేశారు. పలువురు స్థానిక నాయకులు మాట్లాడుతూ...రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనే ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదని వాపోయారు. పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ...నోటిఫికేషన్ లు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అందరికీ భరోసాను కల్పిస్తూ YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలమ్మ ముందుకు సాగారు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయని YSR తెలంగాణ పార్టీ అధికారంలోకి రాగానే మీకిచ్చిన హామీలను నెరవేరుస్తానని తెలిపారు.