బడుగు బలహీన వర్గాలను లేవనెత్తి సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా జీవించిన వ్యక్తి డా. బీఆర్ అంబేద్కర్. నేడు ఆయన వర్ధంతి. సామాజిక పరిస్థితుల మీద ఆయనకున్న అవగాహన అనితరసాధ్యమైనది. భవిష్యత్ తరాల బాగోగులను ముందుగానే చూడగలిగిన దార్శనీకుడు ఆయన. రాజ్యాంగ రూపకల్పనలోనూ, అన్ని వర్గాలకూ న్యాయం చేకూర్చేలా అందులో నిబంధనలు చేర్చడంలోనూ ఆయన చూపిన నైపుణ్యం అమోఘమైనది. తన ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా దీనుల కోసం తన ప్రాణాన్ని అర్పించిన దీనబంధువు ఆయన.
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ నివాళులు అర్పిస్తోంది. ఆత్మగౌరవం కోసం ఎందాకైనా పోరాడండి అని చెప్పిన అంబేద్కర్ మాటలే డా. వైయస్ రాజశేఖర రెడ్డిగారికి ప్రోత్సాహం ఇచ్చాయని షర్మిల గారు చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ మహాశయుడి ఆశయాలను నెరవేర్చడమే వైయస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. రాష్ట్రంలోని చివరి దీనుడి వరకూ సంక్షేమాన్ని పార్టీ తీసుకెళుతుంది. అప్పటి వరకూ పోరాటంలో వెనకాడబోయేది లేదు.