హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. గోదావరి, కృష్ణా బోర్డులు నిర్వహించిన ఒక్క మీటింగుకు కూడా కేసీఆర్ హాజరు కాలేదు. ఆయన తీరు వల్లే నేడు కేంద్రం గెజిట్ జారీ చేయాల్సి గొడవలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే మేం ఎక్కడికైనా వెళ్లి పోరాటం చేస్తాం. అవసరం అయితే ఢిల్లీకి అయినా వెళ్లి కొట్లాడుతాం. మేం తెలంగాణ ప్రజల మంచి కోరేవాళ్లం.