- ప్రతీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ
- మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష
ఈ నెల 11వ తేదీ నుంచి YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గారు ప్రారంభించిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా శనివారం YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు తూడి దేవేందర్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. భారతదేశ చరిత్రలో అనేక మంది పాదయాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 3000 కిలోమీటర్లు పాదయాత్రలో నడిచి, తెలంగాణలోనూ 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న ఒక మహిళగా వైయస్ షర్మిల గారు చరిత్రలో నిలిచిపోతారు. అక్టోబర్ 20న పాదయాత్ర ప్రారంభించినా ఎమ్మెల్సీ కోడ్ తో పాటు కరోనా మూడో వేవ్ తో పాదయాత్రకు విరామం ఏర్పడింది. ప్రభుత్వం పలు ఆంక్షలతో పాదయాత్రను ప్రారంభించకుండా అడ్డుకుంది. చివరికి ఆంక్షలు అన్నీ తొలగిన సందర్భంగా ప్రజా ప్రస్థానం పాదయాత్ర పున:ప్రారంభం కానుంది. గత పాదయాత్రలో 21 రోజుల్లోనే 231 కిలోమీటర్లు, 5 మున్సిపాలిటీలు, 15 నియోజకవర్గాలు, 150 గ్రామాలలో వైయస్ షర్మిల గారు పాదయాత్ర చేశారు. 5 బహిరంగ సభలలో వైయస్ షర్మిల గారు ప్రభుత్వం నిరంకుశ పాలనను ఎండగట్టారు. గ్రామాల్లో మహిళలు, వృద్ధులు, యువత, వికలాంగులు తమ ఇబ్బందులను వైయస్ షర్మిల గారికి వివరించారు. ప్రతీ మంగళవారం యుతవకు నోటిఫికేషన్లు వేయాలని నిరాహార దీక్షలు సైతం వైయస్ షర్మిల గారు చేశారు.
నల్గొండ జిల్లా నర్కెట్ పల్లి మండలంలోని కొండపాకగూడెం గ్రామంలో పాదయాత్రకు విరామం ఏర్పడగా అదే గ్రామం నుంచి పున: ప్రారంభించనున్నారు. అనంతరం నర్కెట్ పల్లిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, నియోజకవర్గంలోని సగానికిపైగా మండలాలలో పాదయాత్ర కొనసాగనుంది. ప్రతీ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష కొనసాగుతుంది.
గతంలో 52లక్షల ఎకరాల్లో పండించిన యాసంగి వరి పంట ఈ ఏడాది 35లక్షల ఎకరాలకే పరిమితమైంది. రానున్న రోజుల్లో యాసంగి పంట ప్రభుత్వం కొనబోమని చెప్పడంతో వరి పంట తగ్గిపోయింది. వరికి ప్రత్యామ్నాయ పంటను టీఆర్ఎష్ ప్రభుత్వం ప్రకటించకపోవడంతో వ్యవసాయంపై ఆదారపడిన కుటుంబాలు నష్టపోతున్నాయి. యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ఏండ్లకు ఏండ్లు కాలయాపన చేస్తున్నారు. నోటిఫికేషన్లు రాక యువత ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో దళితబంధును తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అది అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్న సందర్భంగా హడావిడిగా దళితబంధును తెరపైకి రాష్ట్ర సర్కార్ తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిన కేసీఆర్ దేశ రాజకీయాల వైపు వెళ్తున్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనను ఎండగట్టేందుకే వైయస్ షర్మిల గారు పాదయాత్ర చేయనున్నారు. ప్రస్తుత రాజకీయాలపై ప్రతీ గ్రామంలో ప్రజలతో ప్రత్యేక్షంగా వైయస్ షర్మిల గారు పంచుకోనున్నారు. అధికార పార్టీ తీసుకువచ్చిన ధరణి భూముల సమస్యలపై ప్రజలతో కలిసి వైయస్ షర్మిల గారు గళమెత్తనున్నారు.