- రైతు ఆత్మహత్యలకు కేసీఆరే కారణం
- బంగారు తెలంగాణ పేరు చెప్పి అప్పుల తెలంగాణ చేసిండు
- భూములు, మద్యం అమ్మకాలపైనే ముఖ్యమంత్రి దృష్టి
- మేం అధికారంలోకి వస్తే మహిళలందరికీ ఇండ్లు
- ఇంటిల్లిపాది అర్హులందరికీ పెన్షన్లు ఇస్తాం
- చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పిస్తాం
- చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తాం
- చేనేత యంత్రాలకు ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తాం
- సబ్సిడీపై ముడి సరుకులు అందజేస్తాం
- రాయితీపై లోన్లు మంజూరు చేసి ఆదుకుంటాం
ప్రజాప్రస్థానంలో భాగంగా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు 29వ రోజు పాదయాత్ర ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి మండలం మార్కాండేయ నగర్ లో ప్రారంభించారు. హోళీ పండుగ సందర్భంగా , మహిళలతో కలిసి కాసేపు హోళీ ఆడారు. ఆ తర్వాత ముక్తాపూర్ గ్రామానికి పాదయాత్ర చేరింది. అక్కడ గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మహిళలు, వృద్ధులు వారు పడుతున్న కష్టాల గురించి చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. వారికి భరోసా కల్పించి వైయస్ షర్మిల గారు ముందుకు సాగారు. అనంతరం చింతబావి గ్రామానికి యాత్ర చేరుకుంది. ఈక్రమంలో చేనేత కార్మికులు పడుతున్న కష్టాల గురించి తెలుసుకున్నారు. మగ్గం నేసే విధానాన్ని పరిశీలించారు. వారి కష్టాన్ని తెలుసుకున్నారు. అనంతరం పాదయాత్ర బసవలింగేశ్వర స్వామి కాలనీకి చేరుకుంది. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, స్వాగతం పలికారు. ఆ తర్వాత పాదయాత్ర రేవనపల్లి, గౌస్ కొండ గ్రామాల మీదుగా సాగింది. అక్కడి నుంచి పెద్దరావుల పల్లె గ్రామానికి చేరుకుంది. ఆ తర్వాత బట్టుగూడ గ్రామంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ..
- మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి నాయకుడు వైయస్ఆర్ గారు.
- పేదింటి బిడ్డలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చి, ఉన్నత చదువులు చదివించారు.
- ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించారు. 108, 104 సేవల ద్వారా ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు అందించారు. ఐడేండ్లలో మూడుసార్లు నోటిఫికేషన్లు వేసి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రైవేటు రంగంలోనూ 11 మందికి ఉద్యోగాలు కల్పించారు.
- వైయస్ఆర్ పాలనలో నిరుద్యోగులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు పెరగలేదు. ఐదేండ్లలో ఒక్క పన్ను కూడా పెంచకుండా అద్భుతమైన పాలన అందించారు.
- పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించారు. రాయితీపై విత్తనాలు, ఎరువులు అందజేశారు.
- ఉమ్మడి రాష్ట్రంలో 46 లక్షల మందికి పక్కా ఇండ్లు నిర్మించారు.
- జలయజ్ఞం ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 86 ప్రాజెక్టులు నిర్మించారు.
- ఇప్పుడున్న కేసీఆర్ మాత్రం మోసపూరిత హామీలు ఇస్తూ ప్రజలను దగా చేస్తున్నారు.
- రైతులు ఏ పంట వేయాలో కేసీఆరే డిసైడ్ చేస్తుండు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదు. కేవలం 3లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి, 36లక్షల మందికి ఎగ్గొట్టాడు. కేసీఆర్ ఒక్క మాటా నిలబెట్టుకోలేదు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్నడు.
- మూడెకరాలు భూమి ఇస్తానన్నడు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానన్నడు.
- కేసీఆర్ ను నమ్మి, ముఖ్యమంత్రిని చేస్తే బంగారు తెలంగాణ పేరుతో బారుల తెలంగాణ, బీరుల తెలంగాణ చేశాడు.
- వైయస్ఆర్ ఉన్నపుడు మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. కేసీఆర్ మాత్రం మహిళలకు కనీసం రుణాలు కూడా ఇవ్వడం లేదు.
- కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి కాచుకోమంటున్నాడు. - వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. దున్నపోతు మీద వాన పడ్డట్టుగా కేసీఆర్ లో మాత్రం చలనం లేదు. చస్తే చచ్చారులే.. ఉద్యోగాలు అడిగేవారు ఉండరని కేసీఆర్ అనుకుంటున్నాడు.
- తెలంగాణలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మారాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజా సమస్యలను ఎత్తిచూపడానికే మేం పాదయాత్ర చేపడుతున్నాం. ప్రభుత్వం మెడలు వంచేందుకే మా పోరాటం.
- మేం పార్టీ పెట్టక ముందే తెలంగాణ తల్లి సాక్షిగా నిరుద్యోగుల కోసం మూడు రోజులు నిరాహార దీక్షలు చేశాం.
- పోలీసులతో మా పోరాటాన్ని అణచివేయడానికి మా చేయి విరగ్గొట్టారు, బట్టలు చింపారు. మహిళ అని కూడా చూడకుండా అవమానపరిచారు.
- మమ్మల్ని ఎంత అణచివేసినా నిరుద్యోగుల కోసం మా పోరాటాలు ఆపలేదు.
- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలు చేస్తున్నాం.
- ప్రజా ప్రస్థానం పాదయాత్రలో కూడా మా నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాం.
- మేం ఇంతటి పోరాటం చేయడం వల్లనే కేసీఆర్ గారు నేడు ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మాట్లాడారు.
- YSR తెలంగాణ పార్టీ పోరాటాల ఫలితమే నిరుద్యోగులకు నోటిఫికేషన్లు.
- ఈ ఘనత కేవలం YSR తెలంగాణ పార్టీకే దక్కుతుంది.
- నిరుద్యోగులు డిగ్రీలు, పీజీలు చదివి సమాజంలో తలెత్తుకోలేక , తల్లిదండ్రులకు భారం కాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
- చనిపోయిన నిరుద్యోగుల కుటుంబాలను పాలకులు ఎవరైనా పరామర్శించారా?
- ఎంతోమంది రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
- రాష్ట్రంలో రోజు ఎక్కడో ఓ చోట ఇద్దరు ముగ్గురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ చావులకు ఎవరు కారణం . ఆ కుటుంబాలను ఎవరు ఆదుకుంటున్నారు?
బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణ గా , ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు.
- ఉద్యమ కారుడు కదా అని కేసీఆర్ గారి చేతికి రాష్ట్రం అప్పగిస్తే బార్ల తెలంగాణగా , బీర్ల తెలంగాణ గా మార్చారు.
- ఈ రోజు రాష్ట్రం నడవాలంటే మద్యం అమ్మాలి , లేదంటే భూములు అమ్ముకుంటూ పోవాలి. ఆఖరికి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు, రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారు.
- కానీ కేసీఆర్ గారు, ఆయన కుటుంబం మాత్రం సల్లగా ఉండాలే. ఆయన కుటుంబానికి ఉద్యోగాలు , ప్రజలకేమో ఆత్మహత్యలా?
- కాళేశ్వరం లాంటి పెద్దపెద్ద ప్రాజెక్టులు చేయాలే ఆ కమీషన్లు తినాలే వాళ్లు మాత్రం బాగుండాలి. తెలంగాణ ప్రజలు మాత్రం ఆత్మహత్యలు చేసుకోవాలా?
- ఇప్పుడు కేసీఆర్ కు రెండుసార్లు అధికారం ఇస్తే ఏం చేశారు?
- రాష్ట్రంలో కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు.
- రుణమాఫీ చేస్తానని రైతులను మోసగించారు.
- సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని మహిళల్ని మోసగించారు.
- ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు.
- కేజీ టూ పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశారు.
- ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ప్రతి నెలా రూ.3016 ఇస్తానని మోసం చేశారు.
- పేదల ఇంట్లో అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అని డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని చెప్పి మోసం చేశాడు.
- ఆఖరి గింజ వరకు వరి కొంటా అన్నాడు ఈ రోజు వరి కొనను అంటున్నాడు.
- మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేశాడు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేశాడు.
- ఎస్టీలకు పోడు పట్టాలు ఇస్తామని మోసం చేశారు.
- కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలుండాలే ప్రజలేమో ఆత్మహ్యలు చేసుకోవాలా?
- ఇలా కేసీఆర్ గారు ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశారు.
- ఇదేనా బంగారు తెలంగాణ అంటే?
- తెలంగాణ ప్రజల తరఫున పోరాటం చేయడానికే వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది.
-వైయస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ రాష్ట్రంలో తీసుకురావడానికే వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది.
- మళ్లీ వ్యవసాయాన్ని పండుగ చేస్తాం.
- మహిళలకు మళ్లీ ఆర్థికంగా బలపడేలా రుణాలు ఇస్తాం.
- మహిళల పేరు మీద ఇల్లు నిర్మిస్తాం.
- ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇస్తాం.
- ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం.
- చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ , మహిళలు, రైతులు ,నిరుద్యోగులు, విద్యార్థులు, వికలాంగులకు న్యాయం చేయడం కోసమే మేం వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టాం.
- కేసీఆర్ గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యి కూడా ప్రజలకు అన్యాయమే చేశారు.
- గాడిదకు రంగు పూసి, ఆవు అని చెప్పి నమ్మించే రకం కేసీఆర్ గారు. ప్రజలు నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దు.
- రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఓట్లు వేయించుకోవడానికి కేసీఆర్ దొంగ హామీలు ఇస్తాడు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
- మాట తప్పని మడమ తిప్పని రాజన్న బిడ్డను నేను. ఆఖరి క్షణం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజన్న బిడ్డను నేను. మళ్లీ వైయస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తానని మాటిచ్చి చెబుతున్నా.
- కేసీఆర్ అవినీతి పాలన పోవాలి. కేసీఆర్ అక్రమ పాలన పోవాలి. కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన పోవాలి. వైయస్ఆర్ సంక్షేమ పాలన రావాలి.