– పెట్రోల్, గ్యాస్, నూనె రేట్లు మోడీ పెంచితే..
– కరెంట్, రిజిస్ట్రేషన్, ఆర్టీసీ చార్జీలు కేసీఆర్ పెంచిండు..
– నువ్వా, నేనా అన్నట్లుగా రేట్లు పెంచి, ప్రజలపై భారం మోపుతున్రు
– ఇరు పార్టీలకు బుద్ధి చెబితేనే రేట్లు దిగొస్తయ్
– ఏం అర్హత ఉందని కేసీఆర్ కొడుకు, కూతురుకు పదవులు ఇచ్చారు?
ప్రజాప్రస్థానంలో భాగంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు 38వ రోజు(ఆదివారం) ఉమ్మడి నల్లగొండ జిల్లా తిరుమలగిరి పట్టణంలో పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, వైయస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, షర్మిలక్కకు స్వాగతం పలికారు. తిరుమలగిరి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మాలిపురం, బండ్లపల్లి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. బండ్లపల్లిలో వేరుశనగ రైతుల్ని షర్మిల గారు పరిశీలించారు. రైతులతో మాట్లాడి, ఓదార్పు తెలియజేశారు. అనంతరం వెలిశాల గ్రామంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించి, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ..
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకేతాను ముక్కలు. ఇరు పార్టీలు భారీగా రేట్లు పెంచి ప్రజల రక్తం పీలుస్తున్నయ్. కేంద్రంలోని బీజేపీ పెట్రోల్, గ్యాస్, నూనె రేట్లు పెంచితే.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ కరెంట్, రిజిస్ట్రేషన్, ఆర్టీసీ, మున్సిపల్, నల్లా చార్జీలు పెంచి భారం మోపుతోంది. డిగ్రీలు, పీజీలు చేసిన విద్యార్థులు కేసీఆర్ పేరుతో సూసైడ్ చేసుకుని చనిపోయారంటే, వారి ఆత్మహత్యలకు కారణం కేసీఆరే. అధికారికంగా లక్షా 91వేలు ఖాళీలు ఉంటే.. ఏడేండ్లుగా నాన్చి, ఎన్నికల ముందు 80వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. మా పోరాటాలు, నిరుద్యోగ దీక్షల వల్లే ప్రభుత్వం దిగి వచ్చి నోటిఫికేషన్లు ప్రకటించింది. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని బార్ల తెలంగాణగా, బీర్ల తెలంగాణగా, అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా మార్చిండు. కేసీఆర్ కు వరి వేయొద్దని చెప్పే హక్కు లేదు. మద్దతు ధర అంటేనే వరి పంట వేసుకోమని చెప్పినట్టు. దాన్ని కాలరాసే అధికారం కేసీఆర్ కు లేదు. వరి వద్దని చెప్పే చేతకాన్ని ముఖ్యమంత్రి మనకొద్దు. ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు. ఏం అర్హత ఉందని కూతురుకు, కొడుకుకు పదవులు అప్పగించారో కేసీఆర్ సమాధానం చెప్పాలి.
కేసీఆర్కు రెండు సార్లు అధికారం ఇస్తే అన్ని వర్గాలను మోసం చేశారు. ఏడేండ్లుగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశాడు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెలా రూ. 3016 ఇస్తానని మోసం చేశాడు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేశాడు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేశాడు. కేసీఆర్ రాష్ట్రంలో నాలుగు లక్షల అప్పులు చేసి, ఒక్కో కుటుంబంపై నాలుగు లక్ష అప్పు పెట్టిండు. కేసీఆర్ గారు ఆయన కుటుంబం కోసమే పనిచేస్తున్నారే తప్పా ప్రజల కోసం కాదు.
కేసీఆర్ నాలుగు లక్షల అప్పులు చేసినా.. ఫీజు రీయింబర్స్ మెంట్కు నిధులు ఉండవు. ఆరోగ్యశ్రీకి నిధులు ఉండవు. రుణమాఫీ ఉండదు. మహిళా సంఘాల రుణాలకు వడ్డీలు చెల్లిద్దామన్నా నిధులు ఉండవు. బీడి బిచ్చం కల్లు ఉద్దర అన్నట్లు నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి, రూపాయి లేదంటున్నాడు కేసీఆర్. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినిట్లు ఈరోజు కేసీఆర్ ప్రజలను తాకట్టుపెట్టి అప్పులు తెచ్చి, ఆ అప్పులను మళ్లీ ప్రజలపైనే రుద్దుతున్నాడు. కేసీఆర్ ను నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దు. ఎన్నికల సమయంలో ఎన్నో దొంగ హామీలు ఇస్తాడు. ఎన్నో గారడి మాటలు చెబుతాడు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలి.
వైయస్ఆర్ గారు ఐదేండ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసి, అద్భుత పాలన అందించారు. మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. వైయస్ఆర్ పాలనలో నిరుద్యోగులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. ప్రైవేటు రంగంలోనూ 11 లక్షల ఉద్యోగాలు సృష్టించారు. బీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించి, స్వయం ఉపాధికి తోడ్పాటు అందించారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ అందించారు. పేదింటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చి, ఉన్నత చదువులు చదివించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించారు. 46లక్షల మందికి పక్కా ఇండ్లు నిర్మించి, రికార్డు సృష్టించారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి ఆదుకున్నారు. ఐదేండ్లలో ఒక్క పన్ను కూడా పెంచలేదు. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల కోసం కొట్లాడే పార్టీ. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన పోవాలి.. వైయస్ఆర్ సంక్షేమ పాలన రావాలి. ప్రజలంతా YSR తెలంగాణ పార్టీని ఆదరించాలి. వైయస్ఆర్ సంక్షేమ పాలనకు పట్టం కట్టాలి.