దీక్షలతో రాష్ట్రమంతటా చైతన్యం
ధర్నాలు, నిరసనలతో రాష్ట్ర సర్కారుకు సెగ
వైయస్ షర్మిల గారి పోరాటంతో నోటిఫికేషన్ల విడుదల
ఓ వైపు నిరుద్యోగ నిరాహార దీక్షలు, మరో వైపు ధర్నాలతో గులాబీదండుకు నిద్రలేకుండా YSR తెలంగాణ పార్టీ పోరాటం చేసింది. ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాటం ఆపబోమని ముందుకు కదిలింది. రాష్ట్ర సర్కార్ ఎన్ని విధాలుగా ఆంక్షలు విధించినా, దాడులు చేసినా వాటిని ఎదుర్కొని YSR తెలంగాణ పార్టీ నిలబడింది. YSR తెలంగాణ పార్టీ పోరాటంతో నిరుద్యోగులు రాష్ట్ర మంతటా ధర్నాలకు సైతం దిగారు. యూనివర్సిటీల్లో నిరుద్యోగులు ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం 80వేల ఉద్యోగాలు ప్రకటించింది.
నిరాహార దీక్షలతో నిరుద్యోగుల్లో చైతన్యం
YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆవేదనలో ఉన్నారని ఏప్రిల్ 15న నిరుద్యోగ దీక్ష మొదలు పెట్టారు. మూడు రోజుల పాటు సాగిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. అధికార పార్టీ అండదండలతో పోలీసులు దాడులకు సైతం పాల్పడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల పక్షాన వైయస్ షర్మిల గారు ముందుకు కదిలారు. YSR తెలంగాణ పార్టీ ప్రకటించిన తర్వాత ప్రతీ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలు చేశారు. 17వారాల పాటు నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలు చేస్తూ మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర సర్కారుకు నిరుద్యోగుల గోడును వినిపించారు.
ధర్నాలు, నిరసనలతో దిగివచ్చిన రాష్ట్ర సర్కార్
రాష్ట్ర మంతటా నిరుద్యోగులలో చైతన్యం కలిగించి నోటిఫికేషన్లు విడుదల చేసేలా వైయస్ షర్మిల గారు పోరాడారు. ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వానికి నిరుద్యోగుల గోడును వినిపించారు. పోలీసులు అడ్డుకున్నా ఎక్కడా ఆగకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పోరాడారు. దాదాపు 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వానికి కళ్లు తెరిపించి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వైయస్ షర్మిల గారి పోరాటం, నిరుద్యోగుల చైతన్యంతో దిగివచ్చిన రాష్ట్ర సర్కార్ భారీ నోటిఫికేషన్ ను ప్రకటించింది.