ప్రజాప్రస్థానంలో భాగంగా 31వ రోజు YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు. ఎప్పటిలాగే వైయస్ఆర్ దీవెనలతో యాత్ర మొదలుపెట్టారు. నాగిరెడ్డి పల్లి నుంచి నందనం గ్రామానికి పాదయాత్ర చేరుకుంది. అక్కడ వైయస్ఆర్ వీరాభిమాని అయిన ములుగు రాములు ఇంటికి వెళ్లి పలకరించారు. రాములు అనారోగ్యానికి గురికాగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం పాదయాత్ర అంజిపురం, న్యాముతపల్లి గ్రామాల మీదుగా సాగింది. సాయంత్రం భువనగిరి పట్టణంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ..
– ఎంతోమంది వీరులు, వీరనారీలను పుట్టించిన గడ్డ మన భువనగిరి. మారోజు వీరన్న, రావి నారాయణరెడ్డి, వీరనారి బెల్లి లలిత ఈ గడ్డ నుంచి పుట్టినవారే. నిన్న మరణించిన మల్లు స్వరాజ్యం గారి సొంతూరు కూడా నల్లగొండ జిల్లానే.
– నల్లగొండ జిల్లా అంటే వైయస్ఆర్ గారికి ఎనలేని ప్రేమ ఉండేది.
– ఐదేండ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 33 సార్లు నల్లగొండ జిల్లాకు వచ్చారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
– ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏనాడూ జిల్లాకు రాలేదు. ఉప ఎన్నికలు, ఎన్నికలు వస్తే తప్ప జిల్లా పర్యటనలు గుర్తుకు రావు. ఫామ్ హౌజ్‌కు, ప్రగతిభవన్‌కు మాత్రమే కేసీఆర్ పరిమితం అయ్యారు. ప్రజల బాగోగులు కేసీఆర్ కు పట్టవు.
– బీబీ నగర్లో ఎయిమ్స్ ఏర్పాటు అయ్యిందంటే దానికి కారణం వైయస్ఆర్.. ఆనాడు వైయస్ఆర్ గారు బీబీనగర్‌లో నిమ్స్ ఏర్పాటు చేయడం వల్లే నేడు అది ఎయిమ్స్ అయింది.
– మూసీ నది ప్రక్షాళనకు వైయస్ఆర్ గారు రూ.900 కోట్లు కేటాయించి, క్లీనింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. కేసీఆర్ గారు ఒక్క రూపాయి కేటాయించలేదు. వైయస్ఆర్ మరణించాక మూసీ నదిని పట్టించుకునే వారే లేరు.
– కేసీఆర్ ను నమ్మి, రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసుకుంటే, రెండు సార్లూ ప్రజలను మోసం చేశారు. భువనగిరిలో అభివృద్ధి కుంటుపడింది. రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయి. చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారు.
– నాడు ఉద్యమం కోసం వందలాది మంది మరణిస్తే.. నేడు ఉద్యోగాల కోసం వందలాది మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.
– నా ఉద్యమం కోసం వందలమంది చనిపోతే నేడు ఉద్యోగాల కోసం వందలాది మంది చనిపోతున్నారు.
– 80 వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి తొమ్మిది నెలలు పడుతుందని కేటీఆర్ అంటున్నాడు.
– ఏడేండ్లుగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఉద్యోగాల భర్తీకి తొమ్మిది నెలలు పడుతుందని చెప్పడం సిగ్గుచేటు.
– అదే కేసీఆర్ కుటుంబానికైతే క్షణాల్లో పదవులు వస్తాయి.
– ఇంకెంత మంది ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ కు కనువిప్పు కలుగుతుంది?
– కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడు.
– కేజీ టూ పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు.
-– ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెలా రూ. 3016 ఇస్తానని మోసం చేశాడు.
– పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని చెప్పి మోసం చేశాడు.
– మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేశాడు.
– దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేశాడు.
– కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు.
– కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా మార్చాడు. బంగారు తెలంగాణ పేరుతో ఆత్మహత్యల తెలంగాణగా, అప్పుల తెలంగాణగా మార్చాడు.
– కేసీఆర్ రాష్ట్రంలో నాలుగు లక్షల అప్పులు చేసి, ఒక్కో కుటుంబంపై నాలుగు లక్ష అప్పు పెట్టిండు.
– కేసీఆర్ నియంత పాలన పోవాలి. కేసీఆర్ అక్రమ పాలన పోవాలి. కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన పోవాలి. వైయస్ఆర్ సంక్షేమ పాలన రావాలి.
– కేసీఆర్ గారు ఏడేండ్లుగా ఆయన కుటుంబం కోసమే పనిచేశారే తప్పా ప్రజల కోసం కాదు.
– నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ కుటుంబానికే దక్కాయి.
– కేసీఆర్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
– ఇంట గెలవనోడు, రచ్చ గెలవనీకి పోయినట్లు ఇక్కడి ప్రజల చావులకు కారణమై ఢిల్లీకి పోయి రాజకీయాలు చేస్తారట.
– మోడీ గారు మన రాష్ట్రానికి వస్తే కేసీఆర్ పిల్లిలా దాక్కున్నాడు. రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. ఇప్పుడేమో ఢిల్లీకి పోయి డ్రామాలు మొదలుపెడతారట.
– వరి వేయొద్దంటున్న కేసీఆర్ కు ప్రజలంతా బుద్ధి చెప్పాలి.
– పాదయాత్రలు ఎందుకని కేటీఆర్ అంటున్నాడు. మీ పాలన సరిగ్గా ఉంటే మేం పాదయాత్ర ఎందుకు చేస్తాం?
– మా పాదయాత్ర ప్రజా సమస్యలు ఎత్తి చూపడానికే..
– కేసీఆర్, కేటీఆర్ కు దమ్ముంటే మాతో పాటు పాదయాత్ర చేయండి. ఎంత అభివృద్ధి చేశారో మీరు చూపించండి. ఎన్ని సమస్యలు ఉన్నాయో మేం చూపిస్తాం.
– ఏ సమస్యా లేదని నిరూపిస్తే.. ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతాను. సమస్యలు ఉంటే కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేసి, దళితున్న ముఖ్యమంత్రి చేస్తారా? దమ్ముంటే ఈ సవాల్ ను స్వీకరించాలి.
– రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ అమ్ముడుపోతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్లో ఉన్నారు. కేసీఆర్ చేతిలో ప్రతిపక్షాలు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా తయారయ్యాయి.
– వైయస్ఆర్ గారు ఐదేండ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసి, అద్భుతంగా పాలన అందించారు.
– మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు.
– వైయస్ఆర్ పాలనలో నిరుద్యోగులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోలేదు.
– ప్రైవేటు రంగంలోనూ 11 లక్షల ఉద్యోగాలు సృష్టించారు.
– బీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించి, స్వయం ఉపాధికి తోడ్పాటు అందించారు.
– రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ అందించారు.
– పేదింటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చి, ఉన్నత చదువులు చదివించారు.
– ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించారు.
– 46లక్షల మందికి పక్కా ఇండ్లు నిర్మించి, రికార్డు సృష్టించారు.
– మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి ఆదుకున్నారు.
– ఐదేండ్లలో ఒక్క పన్ను కూడా పెంచలేదు.
– సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధే వైయస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఇండ్లు నిర్మిస్తాం. ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్ లోన్లు అందిస్తాం. చేనేత కార్మికులకు రుణమాఫీ, రాయితీపై ముడిసరుకులు అందజేస్తాం. చేనేత యంత్రాలకు ఉచిత విద్యుత్ అందిస్తాం.
– రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రజావ్యతిరేక పాలన, అక్రమ పాలన, అవినీతి పాలన పోవాలి.. వైయస్ఆర్ సంక్షేమ పాలన రావాలి.