నేడు జాతీయ రైతన్నల దినం. చేతికొచ్చిన వర్షాకాలపు పంటను అమ్ముకొని, యాసంగి పంట వేసి, పొలంలో పనులు చూసుకోవాల్సిన సమయం ఇది. సంతోషంతో సంక్రాంతి వైపు అడుగులు వేయాల్సిన కాలమిది.
కానీ కేసీఆర్ పాలనలో అన్నదాతల గుండె పగులుతోంది. చేతికొచ్చిన పంట ఎండకు ఎండి, వానకు తడుస్తోంది. పొలంలో రావాల్సిన మొలకలు ఐకేపీ సెంటర్లలో వస్తున్నాయి. రైతన్న గోడు పట్టించుకోని అధికారులు ఆ మాటా, ఈ మాటా చెప్పి కొనుగోలు ఆలస్యం చేస్తున్నారు. గట్టిగా అడిగితే కొనబోమని తెగేసి చెబుతున్నారు. మరో గత్యంతరం లేక అన్నదాతలు రోజుకు ఇద్దరు ముగ్గురు బలవన్మరణాలకి పాల్పడుతున్నారు.
రైతు బంధును అని చెప్పుకునే కేసీఆర్ కు ఈ ఆత్మహత్యలు కనిపించడం లేదని, రైతులకు చావు డప్పు కొట్టడమే ఆయన తన పనిగా పెట్టుకున్నారని వైయస్ షర్మిల ఇటీవల వ్యాఖ్యానించారు. రైతన్నల క్షేమం కోరి ఆమె ప్రస్తుతం రైతు ఆవేదన యాత్ర ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన రైతు కుటుంబాల ఇళ్లకు తిరిగి వారి వేదనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. బాధిత కుటుంబాలకు సాయం అందించేవరకు తగ్గబోయేదే లేదని స్పష్టం చేస్తున్నారు.
‘‘అన్నదాతలారా.. మీకివే మా ప్రణామములు. సమాజానికి ధాన్యం అందించడం కోసం మీరు రేయింబవళ్లు కష్టపడి, శ్రమకోర్చి పండించారు. కానీ ఈ దుష్ట పాలకులు మీరు పండించిన వరిని కొనుగోలు చేయబోమని చెబుతోంది. కానీ మీరు భయపడవద్దు. మీకు తోడుగా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తయన ఈ వైయస్ షర్మిల ఉంది. మీకు న్యాయం జరిగే వరకూ పోరాడతాను.
పంట పండించడం రైతు బాధ్యత. దాన్ని కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యత. అదే కనీస మద్దతు ధరలోని ప్రాథమిక సూత్రం. కానీ ఈ పనికిమాలిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించింది. పాలనను గాడికొదిలేసింది. రైతులకు చావు డప్పు మోగించేలా చేస్తోంది. ఈ పాలకులను ఎదిరించడానికి మీ తరఫున నేను అండగా ఉంటాను. చివరి గింజ కొనేవరకూ వెనకడుగు వేయబోయేది లేదు.
అన్నదాతలారా.. మీకు మరోసారి చెబుతున్నాను. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. వైయస్ఆర్ సంక్షేమ రాజ్యం మళ్లీ వస్తుంది. రైతులు సంతోషంగా పండగ చేసుకునే రోజులు తిరిగి వస్తాయి. అప్పటి వరకూ ఓపిక పట్టండి. మీ కుటుంబాల గురించి ఆలోచించి అయినా ఆత్మహత్యా ప్రయత్నాలు మానుకోండి. మీ తరఫున పోరాడటానికి వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మరోసారి చెబుతున్నాను. మీకందరికీ అన్నదాతల దినోత్సవ శుభాకాంక్షలు.’’