నగర అభివృద్ధిలో కీలక పాత్ర
వైయస్ఆర్ హయాంలోనే మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిలో వైఎస్ రాజాశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన హయాంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లాల పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఉన్న 12 మున్సిపాలిటీలను పాత ఎంసీహెచ్ లో విలినం చేసి గ్రేటర్ హైదరాబాద్ ను ఏర్పాటు చేసిన ఘనత వైఎస్సార్ కు దక్కుతుంది. జంట నగరాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించిన గొప్ప నాయకుడు వైఎస్సార్. దేశంలో ఎక్కడా లేని విధంగా శంషాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్టు నిర్మించింది వైఎస్సార్ గారే. జంట నగరాల్లోని మంచి నీటి సమస్య పరిష్కారం కోసం గోదావరి జలాలను హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం.. లగ్జరీ జర్నీ కోసం మెట్రో రైలు తీసుకువచ్చింది వైఎస్సార్. వైఎస్సార్ సిఎంగా ఉన్న సమయంలో ఐటీ కంపెనీలు హైదరాబాద్ వచ్చాయి. యువతకు ఐటీ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఓల్డ్ సిటీ అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసి పాతబస్తీ అభివృద్ది కోసం కృషి చేసిన ఏకైక నాయకుడు వైఎస్సార్. ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిన ఘనత వైఎస్సార్ గారికే దక్కుతుంది. పేద విద్యార్థులకు పెద్ద చదువులు చదివేందుకు డబ్బు ఇబ్బంది కావద్దని ఫీజు రియంబర్స్ మెంట్ కల్పించిన ఘటన వైయస్ఆర్ గారికే దక్కుతుంది. మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్ గారిదే. అన్ని వర్గాలకు వైయస్ఆర్ గారి పాలనలో న్యాయం జరిగింది. ఇలా చెప్పుకుంటు పోతే హైదరాబాద్ అభివృద్దిలో వైఎస్సార్ పాత్ర ఎంతో ఉంది. శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం, ఐదు జిల్లాలతో హెచ్ఎండీఏ ఏర్పాటు, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే, కృష్ణా రెండవ దశ మంచినీటితో పాటు మూసీనది శుద్ధీ, హైదరాబాద్ లో ఐటీని విశ్వవ్యాప్తం చేసింది వైయస్ఆర్ గారే. 2008లో ఐటీ ఎగుమతులు 32,509 కోట్ల రూపాయలకు చేరటం విశేషం. హైదరాబాద్ ను ఆనుకుని ఉన్న 4 జిల్లాలలోని 849 గ్రామాల్లో హెచ్ ఎండీఏ మాస్టర్ ప్లాన్ ను వైయస్ఆర్ గారు నిర్ధేశించడంతోనే ఈ రోజు నగరమంతటా భూములకు విలువ పెరిగింది. సాగర్ ప్రక్షాళనకు వైయస్ఆర్ గారు రూ.370 కోట్ల వ్యయంతో శ్రీకారం చుట్టగా ఆయన మరణాంతరం పనులు ముందుకు సాగలేదు. ఆ రోజుల్లోనే వైయస్ఆర్ గారు చూపిన శ్రద్ధ వల్లే 8లక్షల నీటి కనెక్షన్లకు తాగునీరు సరఫరా అయ్యింది. వైయస్ఆర్ హయాంలోనే మెట్రోకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 72 కిలో మీటర్ల మేర పనులు చేపట్టేందుకు వైయస్సార్ హయాంలోనే 2008లో పునాదులు పడ్డాయి. దీంతో గ్రేటర్ లో ప్రజలకు కొంతమేర ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభించింది.