సంక్షేమం...సమానత్వం...స్వయం సమృద్ధి...సిద్ధాంతాలతో YSR తెలంగాణ పార్టీ జెండా రూపకల్పన జరిగింది. జెండాలోని నీలం, పాలపిట్ట రంగు, తెలంగాణ చిత్రపటంలోని చెదరని చిరునవ్వుతో రాజశేఖర్ రెడ్డి గారి చిత్రం తెలంగాణ సంక్షేమానికి ఆయన వేసిన బాటను కలిపి రూపొందించుకున్న జెండా ఇది.
నీలం రండు సమానత్వం కోసం పోరాటం చేసిన అంబేద్కర్ విధానాన్ని, సమానత్వ నినాదాన్ని పాలనాధికారంలో...పథకాల రూప కల్పనలో, సమాన అభివృద్ధిలో అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయటమే నీలం రంగు ఉద్దేశ్యం.
పాలపిట్ట రంగు దసరా పండుగ నాడు ప్రజలు పాలపిట్టను చూసి ఎంత సంతోష పడతారో.. అదే విధంగా పాలపిట్ట రంగు జెండాను చూస్తే రెట్టింపు సంతోషం కలగాలి.
విజయానికి చిహ్నంగా, సంతోషాలకు గుర్తుగా, స్వయం సమృద్ధికి బాటగా పాలపిట్ట రంగు మన జెండాలో చేరింది. ప్రతీ రోజు దసరా పండుగలా జరుపుకునేందుకే మన పాలపిట్ట రంగు జెండా వచ్చింది.
YSR గారు అందించిన సంక్షేమ పాలనను తిరిగి తీసుకురావడమే ఈ పాలపిట్ట రంగు జెండా ముఖ్య ఉద్దేశ్యం. YSR గారి సంక్షేమ పాలనను గుర్తు చేసేదే మన పాలపిట్ట రంగు జెండా..
తెలంగాణ ప్రజల ఆశలకు...ఆశయాలకు తెలంగాణ ప్రజలకు మళ్లీ ఆ రాజన్న అందించిన సంక్షేమ పాలన రాబోతుంది అని గుర్తుచేస్తుంది. ఈ జెండా YSR గారి చెరగని చిరునవ్వుని..చెదిరిపోని సంక్షేమ సంతకాన్ని గుర్తుచేసేది ఈ జెండా..
సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి ..అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవడం..
ప్రతి ఒక్క వర్గానికి YSR గారు అందించిన సంక్షేమం గుర్తు చేయడం,
ప్రతి ఒక్కరిని సంక్షేమంలో భాగం చేయడం ..
ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించడం ..
ప్రతి ఒక్కర్ని స్వయం సమృద్ధులుగా తయారు చేయడమే YSR తెలంగాణ పార్టీ లక్ష్యం.