ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా పేదలకు ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందించడం కోట్ల మంది బీద, మధ్యతరగతి ప్రజలలో ఎవరికైనా రోగమస్తే, పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ దవాఖానలో 3970 రోగాలకు ఉచితంగా వైద్యం అందించిన గొప్ప నాయకుడు YSR. ఇంటిముందుకే వైద్య సదుపాయం కల్పించే 104, ఎక్కడ ఏ ప్రమాదం జరిగిన..కుయ్..కుయ్...మంటూ గాయపడినవారిని 15 నిమిషాల్లో హాస్పటల్ కు చేర్చి ప్రాణాలను నిలబెట్టే 108 వాహనం తీసుకువచ్చాడు YSR. దేశంలోనే మొదటిసారిగా రైతులకు ఉచిత విద్యుత్తును అందించిన మహానేత YSR. రైతు కష్టాలను చూచి 30లక్షల పంపుసెట్లకు 5 వందల కోట్ల యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందించిన నాయకుడు YSR. 64లక్షల మంది రైతుల రుణాలను చెల్లించి రుణ విముక్తులను చేసిన నాయకుడు YSR. ఏ రైతుకు చెందిన అరఎకరా భూమి కూడా ఎండిపోకుండా ఉండటం, ప్రతి ఎకరా భూమిని తడిపేందుకు జలయజ్ఞం చేపట్టిన నాయకుడు YSR. చదువును కొనాలనుకోవడం కాదు. 33లక్షల మందికి చదువును ఉచితంగా అందించించాలని, ప్రపంచస్థాయి విద్యను పల్లెకు తీసుకురావడం, పల్లె విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా బతుకగల నైపుణ్యాన్ని ఇవ్వాలని, బడుగు బలహీన వర్గాల వారిని పారిశ్రామిక వేత్తలుగా చేసేందుకు, ఫీజురీయింబర్సుమెంట్ తో 100% ఫీజులను మాఫీ చేసి అందరికీ ఉచిత విద్యను అందించిన నాయకుడు YSR. భూమిలేని నిరుపేదలకు 6లక్షల ఎకరాలను YSR పంచి ఇచ్చారు. 40లక్షల గూడు లేని కుటుంబాలకు గృహాలను కట్టిచ్చిన నాయకుడు YSR.పేద ప్రజలు ఆహారం ఇబ్బంది కాకూడదని 2 రూపాయలకు కిలో బియ్యం అందించడం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులైన 77 లక్షల మందికి పింఛన్ తో భరోసాగా నిలబడటం, మహిళలకు, రైతులకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చిన మహానేత YSR.
ముస్లీమ్ మైనారిటీల కోసం...కోర్టులను సైతం ఎదురించి 4% రిజర్వేషన్ తీసుకువచ్చిన నాయకుడు YSR.
ఆన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి వక్ఫ్ బోర్డ్ కు అప్పగించిన నాయకుడు YSR.5 సంవత్సరాల పాలనలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు 11లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన నాయకుడు YSR.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి రుణాలను ఇప్పించి వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన నాయకుడు YSR.