నేడు మహాత్మ జ్యోతీరావు పూలే వర్ధంతి సందర్భంగా YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయం లోటస్ పాండ్ లో పార్టీ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. జ్యోతీరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. అట్టడుగు వర్గాల హక్కుల కోసం, మహిళల అభ్యున్నతి కోసం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆశయాలను సాధించిన నాడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గట్టు రాంచంద్రారావు, జీహెచ్ఎంసీ కో ఆర్డినేటర్ శ్రీ వాడుక రాజగోపాల్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ భూమిరెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి N.సత్యవతి గారు, సికింద్రాబాద్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ సాయిశిల్పచారీ గారు, శేరిలింగంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ కో ఆర్డినేటర్ శ్రీ ఇమామ్ హుస్సేన్ గారు, కంటోన్మెంట్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ శ్రీ మట్టా రవికుమార్ గారు, కూకట్ పల్లి నియోజకవర్గ మహిళా కో ఆర్డినేటర్ శ్రీమతి బి.శివపావని గారు, సంగారెడ్డి జిల్లా దళిత విభాగం అధ్యక్షులు శ్రీ ఉదయ్ సంపత్ గారు , తదితరులు పాల్గొన్నారు.